ఆ రశీదు ఉంటేనే బీమా అవకాశం..!

ఈ ఏడాది రుతుపవనాలు రాష్ట్రంలోని ముందుగానే వచ్చినా అనుకున్నంత మేర వర్షాలు పడలేదు. దీంతో జులై నెల చివర్లో పడుతున్న వర్షాలతో అన్నదాతలు పొలం పనుల్లో నిమగ్నమయ్యారు. రేయింబవళ్లు వ్యవసాయ క్షేత్రాలకు, సామాగ్రి కోసం రాకపోకలు సాగిస్తుంటారు. ఈ సమయాల్లో రైతులు ప్రమాదాల బారిన పడితే ఆ కుటుంబం పడే ఇబ్బందులు అన్ని ఇన్ని కాదు. అప్పటికే ఆ రైతుకు అప్పులు ఉంటే ఆ కుటుంబ పరిస్థితిని ఉహించుకోలేం.

రైతులు ప్రమాదాల బారిన పడితే కుటుంబానికి ఆసరా అందించేందుకు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు బీమా సదుపాయాన్ని కల్పిస్తున్నాయి. అలాగే రైతులకు అండగా నిలిచేందుకు ఇఫ్కో తమ వద్ద ఎరువులు కొనుగోలు చేసేవారికి సహకార సంఘాల నుంచి కొనుగోలు చేసే ప్రతి రైతుకు ఆ సంస్థ ఉచితంగా సంకటహరణ బీమా పథకాన్ని అమలు చేస్తోంది. ఎలాంటి ప్రీమియం చెల్లించకుండానే ఈ సదుపాయాన్ని కల్పిస్తోంది. రైతు మరణించినా, అంగవైకల్యం కలిగినా ఈ బీమా వర్తిస్తుంది.

రశీదు ఉంటేనే బీమా అవకాశం : ఎరువులు కొనుగోలు చేసినప్పుడు రశీదు తప్పనిసరిగా తీసుకోవాలి. అది ఉంటేనే బీమా ప్రయోజనం పొందడానికి అవకాశం ఉంటుంది. బీమాను క్లెయిమ్ చేసుకోవడానికి కొన్ని వివరాలు, ధ్రువీకరణ విక్రయాల రిజిస్టర్ నకలు పత్రం, కేసు నమోదైతే ఎఫ్ఐఆర్ కాపీ, వైద్యుడి చికిత్స నివేదిక, పోస్టుమార్టం రిపోర్టు, మరణ ధ్రువీకరణ పత్రం సమర్పించాల్సి ఉంటుంది. ప్రమాదం జరిగిన తేదీ నుంచి రెండు నెలల్లోగా సికింద్రాబాద్లోని ఇఫ్కో టోకియో సాధారణ బీమా కంపెనీ లిమిటెడ్కు తపాలశాఖ ద్వారా ధ్రువపత్రాలను పంపించాలి….

ఇవి కూడా...

ఇఫ్కో సంస్థ నుంచి ఎరువులు కొన్న రశీదు.

ధ్రువీకరణ విక్రయాల రిజిస్టర్ నకలు పత్రం.

ఎఫ్ఐఆర్ పత్రం.

మెడికల్ సర్టిఫికెట్.

డెత్ సర్టిఫికెట్.

పోస్టుమార్టం రిపోర్టు.

ఎంత కొంటే ఎంత వరకు.