ఓటీటీని షేక్ చేస్తున్న రియల్ క్రైమ్ స్టోరీ…పోలీస్ యూనిఫామ్ వెనక దాగిన కామ పిశాచి…!!

చిన్న సినిమా పెద్ద సినిమా అని తేడాలేమి లేవు. కంటెంట్ కొత్తగా ఉంటే.. చిన్న సినిమాలు సైతం బాక్సాఫీస్ దగ్గర బీభత్సమైన హిట్లు కొడుతుంటాయి. అలాంటి కాన్సెప్ట్‌తోనే వచ్చిన సినిమా ..

కథలు హిట్స్ కొల్లగొడుతుంటే… నెట్‌ఫ్లిక్స్ ఇలాంటి మరో షాకింగ్ స్టోరీతో వీక్షకులను అలరిస్తుంది. అందులో భాగంగా వచ్చిందే. ‘Indian Predator: Beast of Bangalore’. ఇది సినిమా కాదు. యథార్థ కథ. కళ్లెదురుగా జరిగిన క్రైమ్‌ల వెనుక దాగిన మానవ మృగపు కథ. ఇది ఉమేష్ రెడ్డి అనే పోలీస్ కానిస్టేబుల్ లైఫ్ ఆధారంగా రూపొందిన డాక్యుమెంటరీ. బయటికి పోలీస్ యూనిఫాంలో ఉన్న ఈ వ్యక్తి… రాత్రి వేళ సీరియల్ కిల్లర్ అవుతాడు. న్యాయాన్ని రక్షించాల్సిన వాడే.. క్రూరుడుగా మారి అత్యాచారాలు, హత్యలు చేశాడు. బెంగళూరులో ఒంటరిగా ఉన్న మహిళల ఇళ్లలోకి చొరబడి ఇతను అత్యాచారాలు, హత్యలు చేశాడు. మొత్తం 18 మంది మహిళలు అతని అఘాయిత్యానికి బలి అయ్యారు.

ఇతని పాపాలు చూస్తుంటే గుండె వణుకుతుంది. కానీ రియాలిటీని చెప్పడంలో ఈ డాక్యుమెంటరీకి మాస్ మేకింగ్ స్టైల్ ఉంది. ఫ్యాక్ట్స్, ఇన్వెస్టిగేషన్, బాధితుల కథలు అన్నీ చాలా ఇంటెన్స్‌గా చూపించారు. మనస్సు కదిలించే సీన్స్‌కి కొదవ లేదు. అయితే ఈ సిరీస్‌లో బోల్డ్ కంటెంట్, వయొలెన్స్, ఇన్సెన్సిటివ్ డీటెయిల్స్ ఉండటం వల్ల, ఫ్యామిలీతో చూడటాన్ని స్కిప్ చేస్తేనే మంచింది. కానీ ఎవరైతే క్రైమ్ స్టోరీలు వాస్తవికంగా చూడాలనుకుంటున్నారో… ఇది తప్పక చూడాల్సిన కంటెంట్. Beast of Bangalore – ఇది ఫిక్షన్ కాదు.. రియాలిటీ. ఓ పోలీస్ యూనిఫామ్ వెనక దాగిన పిశాచపు మానసిక స్థితిని బయటపెట్టిన బోల్డ్ నెరేటివ్…