Letest news.. ప్రధాన వార్తలు..

సింధూ నదిలో పడిన బస్సు.. ప్రయాణికులు గల్లంతు ...

ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ) సిబ్బంది ప్రయాణిస్తున్న బస్సు సింధూ నదిలో పడిపోయింది. జమ్మూకశ్మీర్‌లోని గుండేర్‌బర్ జిల్లాలోని జిర్పోరాకుల్లన్ వంతెన సమీపంలో ఈ ఘటన జరిగింది. భారీ వర్షాల కారణంగా బస్సు అదుపుతప్పి నదిలో పడిపోయింది. బస్సులో ప్రయాణిస్తున్న వారంతా గల్లంతైనట్లు సమాచారం. అధికారులు గాలింపు చర్యలు చేపడుతున్నారు…..

సర్జరీ చేస్తుండగా భూకంపం.. డాక్టర్లు ఏం చేశారో చూడండి …

ర‌ష్యాలోని కామ్‌చ‌ట్కా ద్వీపంలో బుధవారం 8.8 తీవ్ర‌త‌తో భారీ భూకంపం సంభవించింది. అయితే, ఈ సమయంలో ఆంకాలజీ సెంటర్‌లో ఓ పేషెంట్‌కు శస్త్రచికిత్స జరుగుతుంది. భూకంపతో భవనం కంపించినా, ఆపరేషన్ రూమ్ వణికిపోతున్నా వైద్యులు మాత్రం దైర్యంగా పేషెంట్ బెడ్ వ‌ద్దే ఉన్నారు. కామ్‌చ‌ట్కా ఆరోగ్య శాఖ మంత్రి ఓలేగ్ ఆ ఘ‌ట‌న వీడియోను షేర్ చేశారు. తీవ్ర‌మైన విప‌త్తు స‌మ‌యంలోనూ డాక్ట‌ర్లు చూపిన ప్రొఫెష‌న‌లిజం ప్ర‌శంస‌నీయ‌మ‌ని ఆయ‌న అన్నారు….

రేపు మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ గూండాలను జైళ్లలోకి పంపుతాం – ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్…

కాంగ్రెస్ నేత మైనంపల్లి హన్మంతరావు, కాంగ్రెస్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ వీరి అనుచరులపై పీడీ యాక్ట్ తెరిచి, బైండోవర్ చేయాలి..
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ శంబీపూర్ రాజుకు కాంగ్రెస్ నేత మైనంపల్లి హన్మంతరావు నుండి ప్రాణహాని ఉంది..

మైనంపల్లి హన్మంతరావు, మైనంపల్లి రోహిత్ అనుచరులు శంబీపూర్ రాజుకు బెదిరింపు కాల్స్ చేస్తున్నారు

ఆ ఆధారాలు అన్నిటిని సైబరాబాద్ పోలీస్ కమిషనర్‌కి ఇచ్చాం.. మైనంపల్లి హన్మంతరావు, మైనంపల్లి రోహిత్ మీద చర్యలు తీసుకోవాలి.

వైయస్ జగన్ నెల్లూరు పర్యటనను.. ఆడుకోవడం బాబు లక్ష్యం..పుత్తా శివశంకర్ రెడ్డి , వైయస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి..

వైయస్ జగన్ నెల్లూరు పర్యటనను అడ్డుకోవడం గురించే నారా చంద్రబాబు నాయుడు , నారా లోకేష్ ఆలోచిస్తున్నట్లు ఈ ఆంక్షలను బట్టి అర్థం అవుతోంది

వైయస్ జగన్ దగ్గరికి నాయకులు, జనం వెళ్లకుండా ఎలా అడ్డుకోవాలి అనే ఆలోచనే తప్ప.. సింగపూర్ నుంచి రాష్ట్రానికి పెట్టుబడులు తేవాలనే ఆలోచన లేదు ..

వైయస్ జగన్ నెల్లూరు పర్యటన ….

పర్యటనకి ఆంక్షలు ఉన్నాయి.. రావొద్దంటూ నెల్లూరు సిటీ వైయస్ఆర్ సీపీ ఇంచార్జ్ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి కి నోటీసులు…..

వైయస్ జగన్ నెల్లూరు పర్యటనపై పోలీసులు ఆంక్షలు

ఈ పర్యటనకి రావొద్దంటూ మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి వెళ్లి నోటీసులు ఇచ్చిన పోలీసులు….

కాంగ్రెస్ ఎమ్మెల్యే కోరం కనకయ్యకు నిరసన సెగ

మహబూబాబాద్ జిల్లా గార్లలో ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రాంపురం హై లెవల్ బ్రిడ్జి నిర్మాణం ఎందుకు చేపట్టడంలేదని నిలదీత

వెంటనే స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్

గార్ల మండల పర్యటనకు వచ్చిన ఎమ్మెల్యే కోరం కనకయ్యను మున్నేరువాగు పై అడ్డుకున్న ప్రజలు

బ్రిడ్జి మంజూరు కాకపోతే మీతో పాటు కలిసి బ్రిడ్జి నిర్మాణం కోసం ఉద్యమాలు చేస్తా అని చెప్పి వెళ్ళిపోయిన ఎమ్మెల్యే కోరం కనకయ్య

బ్రిడ్జి నిర్మాణం చేయకపోతే అధికార పార్టీ నాయకులను గ్రామాల్లో తిరగనివ్వబోమని హెచ్చరించిన గ్రామస్థులు….

*పెళ్ళికి ముందు భార్య నడిపిన ప్రేమాయణం తెలిసి, ప్రియుడితో కలిసి చంపేస్తుందేమో అని భయంతో వదిలేసిన భర్త.

మరోసారి దగ్గరై వాడుకొని వదిలేసిన ప్రియుడు

వికారాబాద్ జిల్లా తాండూరు మండలం బెల్కటూరుకి చెందిన అక్షిత అనే యువతి, అదే గ్రామానికి చెందిన సురేష్ అనే యువకుడు ఇద్దరూ ప్రేమించుకోగా.. వీరి పెళ్లికి నిరాకరించిన ఇరు కుటుంబాల పెద్దలు

అక్షితకు కర్ణాటకకు చెందిన యువకుడితో వివాహం జరిపించగా.. నిత్యం ఫోన్ కాల్స్ చేస్తూ ఆమెను వేధించిన ప్రియుడు సురేష్

భార్యకు కాల్స్ రావడం చూసి ఆరా తీసి పెళ్ళికి ముందు ప్రేమాయణం గురించి తెలుసుకున్న భర్త

ప్రియుడితో, భార్యలు కలిసి భర్తలను చంపుతున్నారని భయపడి, అక్షితతో పెద్దల సమక్షంలో తెగదెంపులు చేసుకున్న భర్త

తిరిగి గ్రామానికి వచ్చిన అక్షితను నేనున్నానంటూ మాయమాటలు చెప్పి దగ్గరై, శారీరకంగా వాడుకొని మొహం తిప్పేసిన ప్రియుడు సురేష్
పెళ్లి గురించి మాట్లాడే వరకు సురేష్ దూరం పెట్టడంతో, మోసపోయానని గ్రహించి పోలీసులను ఆశ్రయించిన అక్షిత

అక్షిత ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు..

*భారీ మొత్తంలో ఏపీ లిక్కర్‌ స్కామ్‌ నగదు సీజ్*

హైదరాబాద్‌ శంషాబాద్‌ సమీపంలోని సులోచన ఫార్మ్ గెస్ట్‌హౌస్‌లో AP లిక్కర్ స్కామ్‌కు సంబంధించిన రూ.11 కోట్ల నగదును సిట్ అధికారులు సీజ్ చేశారు.

A40 నిందితుడు వరుణ్ పురుషోత్తం ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా దాడులు చేపట్టిన అధికారులు 12 బాక్సుల్లో దాచిన డబ్బును గుర్తించారు.

ఇది A1 నిందితుడు రాజ్ కెసిరెడ్డి ఆదేశాల మేరకు జూన్ 2024లో వినయ్ సాయంతో దాచినట్టు విచారణలో వెల్లడైంది.

మొత్తం స్కామ్ విలువ రూ.3500 కోట్లు ఉంటుందని సిట్ అంచనా….

*ఆర్టీసీ బస్సులో భారీ మొత్తంలో డబ్బు తరలింపు*

*ఆంధ్రప్రదేశ్ :*

విజయవాడ-నెల్లూరు ఆర్టీసీ బస్సులో తరలిస్తున్న భారీ మొత్తంలో డబ్బును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

బుధవారం ఉదయం ప్రకాశం జిల్లా టంగుటూరు టోల్‌ప్లాజా వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఓ బ్యాగును పరిశీలించగా..

అందులో రూ.49.45 లక్షల నగదును గుర్తించారు. నగదు స్వాధీనం చేసుకున్న పోలీసులు..

తాడేపల్లిగూడెనికి చెందిన మణికంఠను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు…

*యాదాద్రి భువనగిరి జిల్లా*

*ఉత్తమ్ మీకు దమ్ముంటే కన్నెపల్లి పంపుహౌజ్ ప్రారంబించు*.
నిన్న ఇంకో మంత్రి అలిగి కూసున్న నువ్వు ఆగమేఘాల మీద హెలికాప్టర్ లో వెళ్ళి నాగార్జునసాగర్ నుండి నీళ్లు పులిచింతలకు అక్కడ నుండి ప్రకాశం బ్యారేజ్ కు అక్కడ నుండి సముద్రాని కి పంపడానికి పడ్డ తాపత్రయం ఇక్కడ కన్నెపల్లి పంపుహౌజ్ ప్రారంభించడానికి ఎందుకు లేదు? కాళేశ్వరం మోటార్లు ఆన్ చెయ్యకుండా
తుంగతుర్తి,సూర్యాపేట,కోదాడ రైతులను నాశనం చేస్తున్నారు.

కన్నేపల్లి ప్రారంబిస్తే 50లక్షల ఎకరాలకు నీళ్ళు అందించొచ్చు

కాళేశ్వరం కూలిందని లక్షకోట్లు పోయినయ్ అని దొంగ ప్రచారాలు చేస్తున్నవ్ , నన్ను రాజీనామా చెయ్యి అని మాట్లాడుతున్నారు, జిల్లా లోని 12 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసి ఎలక్షన్ కి పోదాం, మీకు దమ్ముందా?

చంద్రబాబు కడుతున్న బనకచర్లకు అనుమతి వచ్చేలా అవకాశం ఇస్తుండు తెలంగాణ ద్రోహి రేవంత్ రెడ్డి.

రేవంత్ ను ముఖ్యమంత్రి చేసిందే మోదీ.రాహుల్ కీ సోయి లేదు, కేవలం తెలంగాణ నుండి వచ్చే డబ్బుల మూటల కోసమే రాహుల్ ఆరాటం.

11 సంవత్సరాల మోదీ పాలన లో తెలంగాణకు చేసిందేమి లేదు.

ఇచ్చిన హామీలు పక్కదారి పట్టించడం కోసమే తిట్టడం మొదలు పెట్టిండు రేవంత్.

రేవంత్ రెడ్డి సహా ఇప్పుడు మంత్రులుగా ఉన్న చాలా మంది BRS హయాంలో మా ఫోన్లు టాప్ అయినాయి అని ప్రచారం చేసుకున్నారు మరి ఇప్పుడు ఆ కాంగ్రెస్ మంత్రులను ఎందుకు పిలవట్లేదు సిట్.

అయినా ఈ రండ గాళ్ల ఫోన్ లు మేము ఎందుకు టాప్ చేస్తాం..

తెలంగాణ కొరకు ప్రాణాలు అడ్డం పెట్టి తెలంగాణ తెచ్చిన కేసీఆర్ ని తిడితే ఊరుకోమ్..

మీ ఉడత ఊపలకు భయపడే వాళ్ళం కాదు.
మా ప్రభుత్వం వచ్చాక సర్కస్ ఆడిపిస్తం బిడ్డా జాగ్రత్త..

తెలంగాణ హక్కులను కాపాడుకుంటం.
ఎలాంటి త్యాగాలకైన సిద్దంగ ఉంటం..