సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను స్వాగతిస్తున్న..కేటీఆర్‌.

అప్రజాస్వామికంగా బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యేలను చేర్చుకున్న కాంగ్రెస్‌ పార్టీకి సుప్రీంకోర్టులో తీవ్ర ఎదురుదెబ్బ తగిలింది. ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలనే విజ్ఞప్తిని దాటవేస్తున్న తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌కు దేశ అత్యున్నత న్యాయస్థానం ఆల్టిమేటం జారీ చేసింది. ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని మూడు నెలల గడువు విధించింది. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌ స్వాగతించారు. సుప్రీం తీర్పుపై హర్షం వ్యక్తం చేస్తూనే కాంగ్రెస్‌ పార్టీకి, రాహుల్‌ గాంధీకి చురకలంటించారు..

దేశం యొక్క ప్రజాస్వామ్య నిర్మాణం హానికరమైన పద్ధతుల ద్వారా క్షీణించకుండా చూసుకున్నందుకు గౌరవనీయ ప్రధాన న్యాయమూర్తికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాలను పటిష్టం చేయాలని, ఫిరాయింపులపై ఆటోమేటిక్ రద్దు చేయాలని తన పంచ న్యాయ్‌లో వాదించిన రాహుల్ గాంధీ ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తారని ఆశిస్తున్నాను. మిస్టర్ గాంధీ, మీ స్వంత ఉపదేశాలకు కట్టుబడి ఉండమని నేను మీకు చెబుతున్నాను అని కేటీఆర్ పేర్కొన్నారు.

గౌరవనీయులైన స్పీకర్ పదవిని మీరు, మీ పార్టీ భారత రాజ్యాంగాన్ని అపహాస్యం చేయడానికి ఉపయోగించుకోరని నేను ఆశిస్తున్నాను. ఈ 10 మంది ఎమ్మెల్యేలు అక్రమంగా కాంగ్రెస్ పార్టీలో చేరి ప్రతిరోజూ అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని అంగీకరించడానికి పెద్దగా పరిశోధన అవసరం లేదు అని కేటీఆర్ తెలిపారు..