మలయాళ నటుడు కళాభవన్ నవాస్ (51) అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. హోటల్ గదిలో శవమై కనిపించారు. సినిమా షూటింగ్లో భాగంగా హోటల్లో బస చేశారు. అయితే హోటల్ సిబ్బంది డోర్ కొట్టినా తెరవలేదు. దీంతో అధికారులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చి తలుపులు పగలగొట్టి డోర్ తెరవగా శవమై కనిపించారు. దీంతో ఆయన మరణవార్త వెలుగులోకి వచ్చింది. చొట్టనిక్కరలోని ఒక హోటల్లో నవాస్ మృతి చెందారని పోలీసులు తెలిపారు…హోటల్ గదిలో నవాస్ విగతజీవిగా పడి ఉండడం చూసి పోలీసులు సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆయన చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. అయితే గుండెపోటుతో చనిపోయి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు..
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.