యాదాద్రి భువనగిరి జిల్లా:
మోత్కూరు మున్సిపాలిటీ కేంద్రంలో నడి రోడ్డు పై ఆగిపోయిన ఎలక్ట్రిక్ బస్సు…
ఇబ్బందుల్లో ప్రయాణీకులు…
సూర్యాపేట నుండి ఉప్పల్ వెళుతున్న rtc ఎలక్ట్రిక్ బస్సు శాటిలైట్ టెక్నీకల్ ఇష్యు కారణంగా మోత్కూర్ లో నడి రోడ్డు పైన ఆగిపోయింది..
సూర్యాపేట నుండి 50 మంది ప్రయాణీకులతో హైదరాబాద్ బయలుదేరిన బస్సు మోత్కూర్ చేరుకోగానే నడి రోడ్డుపై సడెన్ గా ఆగిపోయింది…దీంతో ప్రయాణీకులు గంటల తరబడి రోడ్డుపైనే నిల్చడం జరిగింది వేరే బస్సులు ఏర్పాటు చేస్తామని ఇంకా బస్సులు రాలేదని అంటున్నారు దీంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు ఎలక్ట్రిక్ బస్సు సౌకర్యంగా ఉందని కొత్త బస్సులు ప్రయాణం తొందరగా జరుగుతుందని సాఫీగా గమ్యం చేరుకోవచ్చని బస్సు ఎక్కడం జరిగింది కానీ ఇలా జరగడంతో ప్రయాణికులు చాలా ఇబ్బందులు ఏర్పాటు చేస్తుందని అంటున్నారు బస్సు ఎక్కడ ఉంటే సాటిలైట్ ద్వారా ఎక్కడో దాన్ని రిపేర్ చేస్తున్నారని అది ఎప్పటి వరకు రిపేరు అవుతుందో తెలియదని చేస్తున్నామని డ్రైవర్ చెప్పడం జరిగింది మాకు వేరే బస్సు ఏర్పాటు చేస్తే మేము వెళ్ళిపోతాం కదా గంటల తరబడి రోడ్లపై పిల్లలతో నిలబడడం కష్టంగా ఉందని ఇబ్బంది పడుతున్న ప్రయాణికులు…..
సేకరణ..
ఈదునూరి కృష్ణ.. జర్నలిస్ట్……