నేటి పంచాంగం.. నేటి విశేషం..

🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏
☘️పంచాంగం☘️
శ్రీరస్తు – శుభమస్తు – అవిఘ్నమస్తు,

తేదీ … 04 – 08 – 2025,
వారం … ఇందువాసరే ( సోమవారం )
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం,
దక్షిణాయనం,
వర్ష ఋతువు,
శ్రావణ మాసం,
శుక్ల పక్షం,

తిథి : *దశమి* ఉ9.46 వరకు,
నక్షత్రం : *అనూరాధ* ఉ8.32 వరకు,
యోగం : *బ్రహ్మం* ఉ7.28 వరకు,
కరణం : *గరజి* ఉ9.46 వరకు,
తదుపరి *వణిజ* రా10.35 వరకు,

వర్జ్యం : *మ2.39 – 4.24*
దుర్ముహూర్తము : *మ12.31 – 1.22,*
మరల *మ3.04 – 3.55,*
శుభసమయం : *ఉ 6.41 – 7.17,*
*రా 7.53 – 8.17,*
అమృతకాలం : *రా1.09 – 2.54,*
రాహుకాలం : *ఉ7.30 – 9.00,*
యమగండం : *ఉ10.30 – 12.00,*
సూర్యరాశి : కర్కాటకం,
చంద్రరాశి : వృశ్చికం,
సూర్యోదయం : 5.42,
సూర్యాస్తమయం: 6.29,

*_నేటి మాట_*

*సనాతనధర్మాన్ని – రక్షించడమంటే – అర్థమేమిటి???*
ఎలాగైతే కాపరి పశువులను రక్షిస్తాడో అలా రక్షించడమా అంటే కాదు.
ధర్మాన్ని రక్షించడం అంటే తాను ధర్మాన్ని ఆచరిస్తూ అందరిచేత ఆచరింపచేయడం వలన ధర్మం రక్షింపబడుతుంది.

వెనకటికాలంలో ఎంతోమంది ఎన్నోరకాల జపతపాదిఅనుష్ఠానాలు చేసేవారు.
తమ పిల్లలకు వేరే దేశాలకు పంపిస్తారో లేదో అనేది వేరే విషయం.
మొట్టమొదటగా వారిని సంస్కారవంతులుగా తయారు చేసేవారు తల్లిదండ్రులు.
మా పిల్లలు ధనవంతులు కాకపోతే ఏమైపోతారని భయపడేవారు కాదు…
అయ్యో! మా పిల్లలు సంస్కారహీనులైతే ఏమైపోతారు? అని ఆలోచించేవారు.
ఆ సంస్కారమే వారికి అన్ని రకాల శ్రేయస్సులను అందజేస్తుంది అని భవించేవారు.

కాబట్టి పిల్లలకు చిన్నవయస్సు నుండే రామాయణ, భారత, భాగవత పురాణ ఇతిహాసాదులన్నీ తల్లిదండ్రులు, పెద్దవాళ్ళు చెప్తుండే వారు.
వాటివలన పిల్లల మనస్సులో గొప్ప సంస్కారం ఏర్పడేది. ఆ సంస్కారం చిన్నవయసులో కలిగితే, ఆ సంస్కారమే వారిచేత ధర్మాచరణ చేయిస్తుంది.
అప్పుడు ధర్మాన్ని రక్షించడం అవుతుంది.
మన చేత ఆచరించబడిన ధర్మం పుణ్యంగా మారి మనకు ఈ లోకంలో, పరలోకంలోనే కాక తరువాతి జన్మలకు కూడా శ్రేయస్సును, సుఖాన్ని అనుగ్రహిస్తుంది.

ఈ విధంగా ఆచరణతో మాత్రమే సనాతన ధర్మం రక్షింపబడుతుంది, అదే धर्मो रक्षति रक्षितः |
_శ్రీ శ్రీ విధుశేఖర భారతి స్వామి వారి ప్రసంగం ఆధారంగా…_

*_☘️శుభమస్తు☘️_*
🙏 సమస్త లోకా సుఖినోభవంతు 🙏