జమ్మూ కశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ కన్నుమూత..
Ex jammu and kashmir governor satyapal malik dies ...
దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన సీనియర్ నాయకుడు, జమ్మూకశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ (79) ఇకలేరు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మంగళవారం తుదిశ్వాస విడిచారు. ఆయన మరణవార్తతో రాజకీయ వర్గాల్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆర్టికల్ 370 రద్దులో కీలక పాత్ర 2018–2019 మధ్య కాలంలో జమ్మూకశ్మీర్ గవర్నర్గా పనిచేసిన సత్యపాల్ మాలిక్.. ఆర్టికల్ 370 రద్దు సమయంలో పదవిలో ఉన్న నేతగా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. కేంద్రం తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయం సమయంలో గవర్నర్గా కీలకమైన పరిణామాలను పర్యవేక్షించారు. ఈ నేపథ్యంలో ఆయన పాలన ప్రశంసలతో పాటు విమర్శలను కూడా ఎదుర్కొంది.