రష్యా నుంచి చమురు కొనొద్దన్న తన హెచ్చరికలను పట్టించుకోని భారత్ పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల మోత మోగించారు. భారత్ దిగుమతులపై ఇప్పటికే 25శాతం సుంకాలు విధించిన ట్రంప్.. తాజాగా.. దానిని 50శాతానికి పెంచారు. ఈ మేరకు కార్యనిర్వాహక ఉత్తర్వుపై ట్రంప్ సంతకం చేశారు. అయితే, గతంలో విధించిన 25శాతం సుంకాలు ఆగస్టు 7నుంచి అమల్లోకిరాగా.. అదనంగా పెంచిన 25శాతం సుంకాలు ఆగస్టు 27వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయని ట్రంప్ ప్రకటించారు. అయితే, యుక్రెయిన్ పై రష్యా యుద్ధాన్ని ఆపేస్తే భారత్ పై సుంకాలు తగ్గిస్తారా అని మీడియా ప్రశ్నించగా.. ట్రంప్ ఆసక్తికర సమాధానం ఇచ్చారు..యుక్రెయిన్ పై రష్యా యుద్ధాన్ని కొనసాగించడానికి భారత్ కారణమంటూ కొద్దిరోజులుగా డొనాల్డ్ ట్రంప్ అర్ధంపర్ధంలేని వాదన చేస్తున్న విషయం తెలిసిందే. రష్యా నుంచి పెద్దమొత్తంలో భారత్ చమురు నిల్వలు దిగుమతి చేసుకుంటుండంటం వల్లనే ఇలా జరుగుతుందని, భారత్ చమురు నిల్వలను దిగుమతి చేసుకోవటం నిలిపివేయాలంటూ ట్రంప్ హెచ్చరికలు చేశారు. అయితే, ట్రంప్ హెచ్చరికలను భారత్ పట్టించుకోకపోవడంతో భారత్ దిగుమతులపై భారీ సంకాలను విధించారు. ఈ పరిణామాల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భేటీ అవుతుండటం చర్చనీయాంశంగా మారింది..
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.