డిగ్రీ అర్హతతో ఎస్బీఐలో భారీగా ఉద్యోగాలు..!

భారతదేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) క్లరికల్ కేడర్‌లో జూనియర్ అసోసియేట్ (కస్టమర్ సపోర్ట్ & సేల్స్) ఉద్యోగాల భర్తీకి ప్రకటనను విడుదల చేసింది. ఈ పోస్టులకు అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి అప్లికేషన్లను కోరుతోంది. ఈ నియామక ప్రక్రియ ద్వారా వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో మొత్తం 6,589 ఖాళీలను (5,180 రెగ్యులర్ ఖాళీలు + 1,409 బ్యాక్‌లాగ్ ఖాళీలు) స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భర్తీ చేయనుంది. ప్రిలిమినరీ, మెయిన్స్‌, స్థానిక భాష ప్రావీణ్య పరీక్ష ద్వారా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ ఉంటుంది. అర్హత గల అభ్యర్థులు ఆగస్టు 26వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు.

పోస్టు పేరు – ఖాళీలు

జూనియర్ అసోసియేట్ (కస్టమర్ సపోర్ట్ & సేల్స్) : 6,589 ఖాళీలు

(రెగ్యులర్ పోస్టులు : 5,180 + బ్యాక్‌లాగ్ పోస్టులు : 1,409)

అర్హత :

పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
డిగ్రీ చివరి సంవత్సరం, సెమిస్టర్ విద్యార్థులు తాత్కాలికంగా అప్లై చేసుకోవచ్చు.
కానీ 31.12.2025 నాటికి లేదా అంతకు ముందు గ్రాడ్యుయేషన్ పరీక్షలో పాసై ఉండాలి.
వయోపరిమితి :

2025 ఏప్రిల్ 1వ తేదీ నాటికి 20 ఏళ్ల నుంచి 28 ఏళ్ల వయసు ఉండాలి.
02-04-1997 నుంచి 01-04-2005 మధ్య అభ్యర్థులు జన్మించిన వారై ఉండాలి.
ఓబీసీలకు 3 ఏళ్లు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, దివ్యాంగులకు 10 నుంచి 15 ఏళ్ల వరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
వేతనం : నెలకు రూ.24,050 నుంచి రూ.64,480 వరకు ఉంటుంది..