పల్నాడు జిల్లా : దాచేపల్లి ప్రభుత్వ జూనియర్ కాలేజీ లో ర్యాగింగ్ కలకలం
కాలేజీలో చదివే ఇద్దరు విద్యార్థులను దారుణంగా కొట్టిన తోటి విద్యార్థులు… ఐదుగురు కలిసి ఒక విద్యార్థిని అతి కిరాతంగా కొట్టిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..
https://www.facebook.com/share/v/1EEcYRTAsr/
పల్నాడు జిల్లా దాచేపల్లి ప్రభుత్వ జూనియర్ కాలేజీ(Dachepalli Government Junior College)లో ర్యాగింగ్ కలకలం రేగింది. ఇద్దరు కాలేజీ విద్యార్థు(Students)లను తోటి విద్యార్థులు దారుణంగా దాడి చేశారు. ఐదుగురు కలిసి ఒక విద్యార్థిని అతి కిరాతంగా కొట్టారు. బీసీ హాస్టల్(Bc Hostel)కి తీసుకు వెళ్లి కొట్టి ,కరెంట్ పెట్టిమ మరీ చంపుతామని బెదిరించారు. బయటనుంచి వ్యక్తితో కలిసి ఐదుగురు విద్యార్థులు దాడి చేసినట్లు బాధిత విద్యార్థి చెబుతున్నారు. ఈ ఘటనపై విద్యార్థుల తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే తమ ఫిర్యాదును పోలీసులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు…
పోలీస్ ల స్పందన..!..
దాచేపల్లి లోని వెనుకబడిన బాలుర వసతి గృహం నందు మైనర్ బాలుడిని తోటి విద్యార్థులు కొడుతున్నటువంటి వీడియో సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతున్నది..
బాలుడు మైనర్ అయినందు వలన అతనికి సంబంధించినటువంటి వీడియోలు సామాజిక మాధ్యమాలలో పోస్ట్ చేయడం చట్టరీత్యా నేరం. కావున మీడియా మిత్రులు ఈ విషయమును గమనించవలసినదిగా విజ్ఞప్తి….