నన్ను ఎవరూ ఆపలేరు..తారక్ ఎమోషనల్…

జూనియర్ ఎన్టీఆర్-హృతిక్ రోషన్ హీరోలుగా వస్తున్న వార్-2 ఆగస్టు 14న వస్తోంది. మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను తాజాగా హైదరాబాద్ లో నిర్వహించారు. ఇందులో ఎన్టీఆర్ మాట్లాడుతూ.. హృతిక్ రోషన్ నుంచి చాలా నేర్చుకున్నాను. ఆయనలో నన్ను నేను చూసుకునేవాడిని. అతను ప్రతి రోజూ సెట్స్ కు వచ్చాక నేర్చుకుంటాడు. అదే హృతిక్ రోషన్ అంటే. 25 ఏళ్ల క్రితం నిన్ను చూడాలని ఉంది సినిమాతో రామోజీ రావు నన్ను పరిచయం చేశారు. ..
NTR Full Speech
ఎన్టీఆర్ – హృతిక్ రోషన్ కాంబోలో బాలీవుడ్ లో భారీగా తెరకెక్కుతున్న స్పై సినిమా వార్ 2 ఆగస్టు 14న పాన్ ఇండియా వైడ్ రిలీజ్ కానుంది. నేడు వార్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. భారీగా అభిమానుల మధ్య ఈవెంట్ ని నిర్వహించారు..ఈ ఈవెంట్ కి హృతిక్ రోషన్ కూడా వచ్చారు. ఎన్టీఆర్ ఈ సంవత్సరంతో 25 ఏళ్ళు పూర్తి చేసుకోవడంతో మరింత గ్రాండ్ గా ఈవెంట్ నిర్వహించారు. దీంతో ఎన్టీఆర్ కూడా మొదటి బాలీవుడ్ సినిమా, 25 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా స్పెషల్ గా స్పీచ్ ఇచ్చారు..

ఇక అభిమానులుగా నా కుటుంబ సభ్యులుగా నేను చేసిన తప్పులను క్షమిస్తూ.. బాధతో నేను కన్నీళ్లు కారిస్తే మీరు కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు. నా ఆనందంలో భాగమయ్యారు. నాకోసం మీరు చేసిన ప్రార్థనలకు ఎన్ని జన్మలెత్తినా మీ ఋణం తీర్చుకోలేను అంటూ ఎన్టీఆర్ ఈ సందర్భంగా తనకు మద్దతు తెలిపిన అభిమానులకు దర్శక నిర్మాతలకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఇక ఈ సినిమా గురించి ఎవరెన్నీ మాట్లాడుకున్నా పర్లేదు బొమ్మ అదిరిపోయింది. పండగ చేసుకోండి అంటూ కాలర్ ఎత్తి మరి అభిమానులను ఉత్సాహపరిచారు. ఎన్టీఆర్ స్పీచ్ తో అభిమానులలో కూడా తెలియని ఉత్సాహం నెలకొనడమే కాకుండా సినిమాపై మంచి అంచనాలు కూడా పెరిగిపోయాయి..

ఇక ఇప్పుడు కూడా నాగ వంశీ బలవంతం చేస్తేనే ఇక్కడికి వచ్చానని అలాగే తన సినీ జర్నీ 25 సంవత్సరాలు పూర్తి అయిన నేపథ్యంలో అందరిని కలవాలన్న ఉద్దేశంతోనే తాను ఇక్కడికి వచ్చానని ఎన్టీఆర్ తెలిపారు. తాను అయాన్ ముఖర్జీ (Ayan Mukerji)దర్శకత్వంలో తెరకెక్కిన బ్రహ్మాస్త్ర సినిమా వేడుకకు రావాల్సి ఉంది కానీ కొన్ని కారణాల వల్ల రాలేకపోయాను కానీ విధి మాత్రం ఆయన దర్శకత్వంలోనే సినిమా చేసే అవకాశాన్ని కల్పించిందని తెలిపారు. అయాన్ ఎంతో అద్భుతంగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారని వెల్లడించారు. 25 సంవత్సరాల క్రితం హృతిక్ రోషన్(Hrithik Roshan) గారు నటించిన మొదటి సినిమాలో ఆయన చేసిన డాన్స్ చూసి తనను ఇన్స్పిరేషన్ గా తీసుకున్నాను ఇన్నాళ్లకు తనతో కలిసి డాన్స్ చేసే అవకాశం వచ్చిందని ఈ అవకాశాన్ని కల్పించిన చిత్ర బృందానికి ఈ సందర్భంగా తారక్ ధన్యవాదాలు తెలిపారు..
మొదటి సినిమా పూజా కార్యక్రమాలకు వెళ్ళినప్పుడు తన పక్కన అమ్మ, నాన్న తప్ప ఎవరూ లేరు. కానీ ఈరోజు ఎంతోమంది నాకు అండగా నా కుటుంబ సభ్యులుగా మీరు ఉన్నారని ఎన్టీఆర్ వెల్లడించారు. తనపై ఎప్పుడు తన తండ్రి హరికృష్ణ గారు, తన అన్నయ్య జానకిరామ్ గారి ఆశీస్సులు ఉంటాయని అలాగే కళ్యాణ్ రామ్ గారి అండదండలు ఉంటాయని తెలిపారు. నందమూరి తారక రామారావు గారి ఆశీస్సులు నాపై ఉన్నన్ని రోజులు నన్నెవరూ ఆపలేరు. నన్ను ఇంతలా సపోర్ట్ చేస్తున్న దర్శకులకు, నిర్మాతలకు అభిమానులకు నా పాదాభివందనాలు . అంతా ఒక తల్లి కడుపున పుట్టకపోయినా నన్ను కడుపులో పెట్టుకొని చూసుకుంటున్నారు అంటూ ఈ సందర్భంగా తారక్ ఎమోషనల్ అయ్యారు..