సింధూ నది జలాలను విడుదల చేయాలని భారత్ కు అంతర్జాతీయ న్యాయస్థానం ఆదేశం..
అంతర్జాతీయ న్యాయస్థానం ఆదేశాలను తిరస్కరించిన భారత్
సింధూ నది జలాల వివాదం పైన అంతర్జాతీయ కోర్టుకు అధికార పరిధి లేదని తేల్చి చెప్పిన భారత్
ఆపరేషన్ సింధూర్ లో భాగంగా పాకిస్తాన్ కు సింధు నది జలాల విడుదలను విరమించుకున్న భారత్…..
సింధూ నది జలాల వివాదంపై అంతర్జాతీయ న్యాయస్థానం స్పందించింది. పాక్‌కు జలాలను విడుదల చేయాలని భారత్‌ను ఆదేశించింది. అయితే భారత్ ఈ ఆదేశాలను తిరస్కరించింది. సింధూ నది జలాలపై తీర్పు చెప్పే అధికారం అంతర్జాతీయ కోర్టుకు లేదని భారత్ స్పష్టం చేసింది. ‘ఆపరేషన్ సిందూర్’లో భాగంగా పాకిస్థాన్‌కు సింధూ నది జలాల విడుదలను భారత్ నిలిపివేసిన విషయం తెలిసిందే.మే నెల నుంచి నిలుపుదల చేసిన సింధూ జలాల ఒప్పందాన్ని తిరిగి పునరుద్ధరించాలని పాకిస్థాన్ విదేశాంగ కార్యాలయం సోమవారం భారత్‌ను కోరింది. అయితే ఇది జరిగిన వెంటనే పాక్ ప్రధాని ఇస్లామాబాద్‌లో జరిగిన అంతర్జాతీయ యువజన దినోత్సవంలో మాట్లాడుతూ, భారత్‌ను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు.
ఏప్రిల్ 22 పహల్గాం ఉగ్రదాడి తరువాత, 1960ల నాటి సింధు జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపివేసింది. ఉగ్రవాదులకు పాక్ మద్దతు ఇస్తుండడమే ఇందుకు కారణమని భారత్ స్పష్టం చేసింది. 1960లో ప్రపంచ బ్యాంక్ మధ్యవర్తిత్వంతో భారత్-పాక్‌ల మధ్య సింధు జలాల ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం, బియాస్, సట్లెజ్, రావి నదులపై భారత్‌కు పూర్తి హక్కులు దఖలు పడ్డాయి. సింధు, జీలం, చీనాబ్ నదుల నీటిపై పాకిస్థాన్‌కు హక్కులు లభించాయి. అయితే ఈ ఒప్పందాన్ని నిలిపివేసిన భారత్, జమ్మూకశ్మీర్‌లోని చీనాబ్ నదిపై 1856 మెగావాట్ల సామర్థ్యం కలిగిన అతిపెద్ద జలవిద్యుత్ ప్రాజెక్ట్‌ను నిర్మించాలని ప్లాన్ చేస్తోంది. వాస్తవానికి సింధూ జలాల ఒప్పందం అమలులో ఉంటే, చీనాబ్‌పై ప్రాజెక్టు నిర్మించాలంటే పాక్ నుంచి నో-అబ్జెక్షన్ పొందాల్సి ఉంటుంది…