జియో(Jio) కనీస రీఛార్జ్ ప్లాన్స్ రద్దు చేసింది, వాటి స్థానంలో కొత్త ప్లాన్లను తీసుకువచ్చింది. రూ.209 రీఛార్జ్ ప్లాన్
22 రోజుల వ్యాలిడిటీ కలిగిన ఈ జియో రీఛార్జ్ప్లాన్ 22 రోజుల వ్యాలిడిటీ ఉంటుంది..
రోజుకు 1 జీబీ డేటా, 100 SMSలు పొందవచ్చు. అయితే ఈ ప్లాన్ను జియో రద్దు చేసింది. 28 రోజుల వ్యాలిడిటీ కలిగిన మరో రీఛార్జ్ ప్లాన్…. రూ.249 ప్లాన్. ఇందులో డైలీ 1జీబీ డేటా, 100 SMSలు పొందవచ్చు. జియో ప్రస్తుతం ఈ రెండు ప్రీపెయిడ్ ప్లాన్లను రద్దు చేసింది.
కొత్త బేసిక్ ప్లాన్స్ ఇవే…
రూ. 209, రూ.249 రీఛార్జ్ ప్లాన్స్ రద్దు చేయడంతో జియో యూజర్లు ఇక తప్పనిసరిగా రూ.299 ప్లాన్ ఎంచుకోవాల్సి ఉంటుంది. 28 రోజుల వ్యాలిడిటీ కలిగిన ఈ రీఛార్జ్ ప్లాన్లో డైలీ 1.5జీబీ డేటా లభిస్తుంది.
జియో(Jio) లో కనీస రీఛార్జ్ ఎంతంటే?.
రిలయన్స్ జియోల్ 28 రోజుల వ్యాలిడిటీతో అతి తక్కువ ధర కలిగినది రూ.189 రీఛార్జ్ ప్లాన్. 28 రోజుల వ్యాలిడిటీతో పాటు 2జీబీహైస్పీడ్ డేటా లభిస్తుంది. అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్, 300 SMSలతో పాటు JioTV, JioAICloud సబ్స్క్రిప్షన్ పొందవచ్చు.
రిలయన్స్ జియో మాత్రమే కాకుండా,వొడాఫోన్-ఐడియా, ఎయిర్టెల్ కూడా తమ బేసిక్ ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్స్ సవరించాయి. ఎయిర్టెల్లో కూడా ప్రస్తుతం కనీస రీఛార్జ్ రూ.299తో ప్రారంభమవుతుంది. అయితే రోజుకు 1జీబీ డేటా మాత్రమే లభిస్తుంది. మరో 6 నెలల్లో ఇతర టెలికాం కంపెనీలు కూడా మొబైల్ రీఛార్జ్ ధరలు పెంచే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
గమనిక..: కథనం సమాచారం కోసం మాత్రమే… దీన్ని మీరు రీచార్జ్ చేసుకునేటప్పుడు పూర్తిస్థాయిలో ఆన్లైన్లో చెక్ చేసుకుని లేదా డీలర్ ని అడిగి రీఛార్జ్ చేసుకోగలరు..