ఇండస్ట్రీ అభివృద్ధికి సీఎం కృషి అభినందనీయం: చిరంజీవి..

ఇండస్ట్రీ సమస్యను సామరస్య పూర్వకంగా పరిష్కరించి, అటు నిర్మాతలు, ఇటు కార్మికులకు సమన్యాయం చేసిన సీఎం రేవంత్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు. ‘ఇండస్ట్రీ అభివృద్ధికి రేవంత్ చర్యలు అభినందనీయం. ప్రపంచ చలనచిత్ర రంగానికే హైదరాబాద్‌ను ఓ హబా మార్చేందుకు కృషి చేస్తున్నారు. టాలీవుడ్‌కు ప్రభుత్వం అన్ని రకాలుగా అండదండలు అందిస్తోంది’ అని ఆయన పేర్కొన్నారు..