ఒక ప్రశాంతమైన ప్రదేశంలో జరిగిన విచిత్రమైన దృశ్యం ఇప్పుడు అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. తరచుగా సోషల్ మీడియాలో ఇలాంటి వీడియోలే వైరల్ అవుతూ ఉంటాయి. జనాలు ఎక్కువగా చిత్ర విచిత్రాలు కలిగిన వీడియోలను ఎక్కువగా ఇష్టపడుతూ చూస్తూ ఉంటారు. దీనిని దృష్టిలో పెట్టుకొని.. కొంతమంది కావాలని ఇలాంటి వీడియోలు పోస్ట్ చేస్తూ ఉన్నారు. తాజాగా వైరల్ అవుతున్న వీడియో ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఈ వీడియోలో అత్యంత ప్రమాదకరమైన నాగుపాము ట్రెజరీకి కాపలాగా నిలవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. వీడియోకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. ..అత్యంత ప్రమాదకరమైన నాగుపాము బంగారు ట్రెజరీ ముందు విశ్రాంతి తీసుకోవడం మీరు గమనించవచ్చు.. అది ఆ బాండాకారాన్ని ఎవరు దొంగలించకుండా దాని చుట్టూ కాపలాగా చుట్టుకొని ఉండడం.. పాము అటూ ఇటూ చూస్తూ ఉండడం ఆశ్చర్యమేస్తోంది. అంతేకాకుండా ధనం కలిగిన గోల్డెన్ పాత్రకి కాపలాగా నిలవడం చూసి సోషల్ మీడియా వినియోగదారులు నివ్వెర పోతున్నారు. హిందూ పురాణాల్లో పాములు బంగారు నిధులకు రక్షణగా నిలిచిన ఎన్నో ఘటనాల గురించి ప్రస్తావించారు. రాజులు ఎక్కువగా తమ నిధులను కాపాడుకోవడానికి పాములను మాత్రమే సెక్యూరిటీగా పెట్టే వారట.. అందులో భాగంగానే ఈ నిధికి కాపలాగా నిలుస్తోందని కొంతమంది సోషల్ మీడియా వినియోగదారులు కామెంట్లు చేస్తున్నారు.
ఈ వీడియో చూసిన కొంతమంది ఇది ఎవరో కావాలనే వ్యూస్ కోసం ఇలా బంగారు రంగు కడవను పాము దగ్గర ఉంచి వీడియో తీసినట్లు ఉందనిపిస్తోందని కామెంట్లు చేస్తున్నారు. వరి కొంతమంది అయితే, ఆ నాగుపాము ట్రెజరీకి సెక్యూరిటీగా గత కొన్ని నీళ్లుగా అలానే ఉంటుందని అంటున్నారు. ఏది నిజమో ఏది అబద్దమో తెలియదు కానీ.. ఈ వీడియో చూస్తే వ్యూస్ కోసం కావాలని ఇలా వీడియో చిత్రీకరించి పోస్ట్ చేసినట్లు తెలుస్తోంది. తాజాగా ఇలాంటి ఘటనలకు సంబంధించిన ఎన్నో వీడియోలు సోషల్ మీడియాలో లక్షల కొద్ది వ్యూస్ను సంపాదించాయి. దీనిని దృష్టిలో పెట్టుకొని ఈ వీడియోను పోస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఈ వీడియోను ఓ యూట్యూబ్ ఛానల్ నుంచి పోస్ట్ చేశారు. దీనిని 17 మందికి పైగా సోషల్ మీడియా వినియోగదారులు లైక్ చేసినట్లు తెలుస్తోంది..