గర్భవతి భార్యను హత్య చేసిన భర్త..

మేడ్చల్ జిల్లా మేడిపల్లి పరిధి బాలాజీహిల్స్‌లో ఓ క్రూర ఘటన చోటుచేసుకుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను అత్యంత కిరాతకంగా హత్య చేశాడు భర్త. గర్భవతైన భార్యను చంపిన అనంతరం శరీరాన్ని ముక్కలుముక్కలుగా చేశాడు. తలతో పాటు కొన్ని శరీరభాగాలను కవర్‌లో పెట్టి పడేయడానికి సిద్ధమయ్యాడు. గదిలో శబ్దాలు విని పొరుగువారు వెళ్లి చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు..

గర్భవతైన భార్యను చంపిన భర్త, ఆమె మృతదేహాన్ని ముక్కలు ముక్కలు చేశాడు. వికారాబాద్‌ జిల్లా కామారెడ్డిగూడకు స్వాతి, మహేందర్‌ ప్రేమవివాహం చేసుకున్నారు. గత కొంతకాలంగా బోడుప్పల్‌లో నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో శనివారం మధ్యాహ్నం స్వాతిని (22) హత్యచేసిన మహేందర్‌.. తల, కాళ్లు, చేతులు వేరు చేసి వాటిని మూసీ నదిలో పడేశాడు. మిగిలిన మొండాన్ని కవర్‌లో ప్యాక్‌ చేసి పెట్టాడు. అయితే దానిని తీసుకెళ్లే పరిస్థితి లేకపోవడంతో గదిలోనే ఉంచాడు..

చేసి చెప్పాడు. దీంతో ఆమె స్వాతి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చింది. అనుమానం వచ్చిన వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న మేడిపల్లి పోలీసులు మహేందర్‌ను అదుపులోకి తీసుకున్నారు. హత్యకుగల కారణాలపై ఆరా తీస్తున్నారు…వికారాబాద్ జిల్లా కామారెడ్డిగూడకు చెందిన మహేందర్ రెడ్డి, స్వాతి ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు. వీరు బోడుప్పల్‌లో కాపురం ఉంటున్నారు. ప్రస్తుతం స్వాతి గర్భవతి. అయితే, మహేందర్ రెడ్డి తన భార్యను దారుణంగా హత్య చేసి మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికాడు. రంపంతో దారుణంగా శరీరాన్ని కట్ చేశాడు. అనంతరం శరీర భాగాలను కవర్లలో ప్యాక్ చేసి బయట పడేయడానికి సిద్ధమయ్యాడు. ఆ సమయంలో గది నుంచి వింత శబ్దాలు రావడంతో పక్కింటి వారు అనుమానించి లోపలికి వెళ్లి చూశారు. దీంతో ఈ ఘోరం బయటపడింది. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడు మహేందర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు.
ఘటనా స్థలంలో కేవలం స్వాతి ఛాతీ భాగాన్ని మాత్రమే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తల, చేతులు, కాళ్లు, భుజాలు వంటి ఇతర శరీర భాగాలను నిందితుడు వేర్వేరు ప్రాంతాల్లో పడేసినట్లు తెలుస్తోంది. వాటిని కనుగొనడానికి పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. స్వాతి, మహేందర్ గతంలో ఇదే ఇంట్లో పది నెలల పాటు అద్దెకు ఉన్నారని స్థానికులు తెలిపారు. తిరిగి 25 రోజుల క్రితమే మళ్లీ ఇక్కడికి వచ్చారని వెల్లడించారు. కాగా, ఈ హత్యకు గల కారణాలపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ కలహాలు, ఆర్థిక సమస్యలు లేదా అక్రమ సంబంధాలు వంటివి కారణమై ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించగా.. విచారణ తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.