ఢిల్లీకి సీఎం రేవంత్.. డిప్యూటీ సీఎం భట్టి..
సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల అంశంపై న్యాయ నిపుణుల సలహా తీసుకోనున్నారు. అక్టోబర్ 2న రాహుల్ గాంధీ పాదయాత్రలో పాల్గొనేందుకు సీఎం,మంత్రులు బీహార్ వెళ్లనున్నారు. ఢిల్లీ పర్యటన తర్వాత ఈనెల 27న సీఎం బీహార్ కు వెళ్లనున్నారు..
*ఏపీ ప్రజలకు అలర్ట్.. రేషన్ పంపిణీలో
కొత్త మార్పులు*
ఆగస్ట్ 25వ తేదీ నుంచి ఏపీలో స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ.
ఈ నేపథ్యంలోనే సెప్టెంబర్ నెల నుంచి రేషన్ పంపిణీలో కొత్త మార్పులు చోటుచేసుకునే అవకాశం
స్మార్ట్ రేషన్ కార్డులు,ఈ-పోస్ యంత్రాల సాయంతో సర్వర్ సమస్యలు, వేలిముద్రల ఇబ్బందులకు చెక్ పెట్టాలని భావిస్తున్న ప్రభుత్వం
ఇకపై రేషన్ తీసుకునే సమయంలో వేలిముద్రలు పడకపోయినా లబ్ధిదారులు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు
ఈ- పోస్ మెషీన్లో ఉన్న కెమెరా సాయంతో ఐరిస్ స్కాన్ చేసి రేషన్ సరుకులు అందిస్తారు….
గచ్చిబౌలిలో డ్రగ్స్ పార్టీపై పోలీసుల రైడ్స్
రాజమండ్రి డిప్యూటీ తహశీల్దార్ మణిదీప్, అమెరికా నుండి వచ్చిన నీలిమ, మరో ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు
20 గ్రాముల కొకైన్, నాలుగు గ్రాముల MDMA, 20 NTC మాత్రలు స్వాధీనం
డ్రగ్స్ బెంగళూరు నుండి తీసుకొచ్చినట్లు గుర్తించిన పోలీసులు
ప్రధాన నిందితుడు విక్రమ్‌ను డిచ్పల్లి పోలీసులు అరెస్టు….
పల్నాడు జిల్లా
సత్తెనపల్లి
ముప్పాళ్ళ మండలం చాగంటివారిపాలెం ఎంపీడీవో ఆఫీస్ పక్కన ఉన్న చెట్లలో వ్యక్తి ఆత్మహత్య
పెన్షన్ తొలగించారని దిగులుతో తన భర్త ఆత్మహత్య చేసుకున్నాడు అంటూ భార్య రామలింగమ్మ ఆరోపణ
గత రెండు సంవత్సరాల నుంచి కంటి సమస్యపై ఆరువేల రూపాయలు పెన్షన్ తీసుకుంటున్న మృతుడు రామలింగారెడ్డి(48)
పెన్షన్ల రి వెరిఫికేషన్ చేసి పెన్షన్లు తీసివేసిన అధికారులు
సరైన పత్రాలతో మరోసారి పెన్షన్ కు అప్లై చేసుకోవాలంట్టూ అధికారులు సూచన…
*AP :: రాష్ట్రంలో డిప్యూటీ తహశీల్దార్ పోస్టులు మరో ఏడాది కొనసాగింపు*
రెవెన్యూ శాఖ ప్రతిపాదన మేరకు రాష్ట్రంలో 175 డిప్యూటీ తహసీల్దార్ (Elections) పోస్టులను మరో సంవత్సరం పాటు కొనసాగిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
▪️ఈ పోస్టులు 01-04-2025 నుంచి 31-03-2026 వరకు మాత్రమే తాత్కాలిక ప్రాతిపదికన కొనసాగుతాయి.
*వీరి ప్రధాన బాధ్యతలు:*
▪️ఓటరు జాబితాల నిరంతర నవీకరణ
▪️EPIC (Voter ID) కార్డుల జారీ
▪️పేర్ల సవరణలు, చిరునామా మార్పులు మరియు ఇతర ఎలక్షన్ సంబంధిత పనులు.
*ప్రధాన షరతులు:*
▪️పోస్టులు పూర్తిగా తాత్కాలికం మాత్రమే.
▪️ఈ పోస్టులపై ఎటువంటి పదోన్నతులు (Promotions) ఇవ్వకూడదు అని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు..
తిరుపతి.
పోలీసులపై హోటల్ సిబ్బంది దాడి.
అన్నమయ్య సర్కిల్ సమీపంలోని 5 స్టార్ చికెన్ హోటల్లో ఘటన.
కుటుంబ సభ్యులతో హోటల్ కు వెళ్లిన స్పెషల్ బ్రాంచ్ ఏఎస్ఐ రామ్మోహన్.
ఇచ్చిన ఆర్డర్ ఒకటైతే మరొక ఆర్డర్ తెచ్చి ఇచ్చిన సర్వర్.
ఇదేమిటని ప్రశ్నించిన ఏ ఎస్ ఐ కుటుంబంపై దుర్భాషలాడి దాడి.
విషయం తెలుసుకున్న ఈస్ట్ ఎస్ఐ గిరిబాబు పై దాడికి చేసిన వైనం.
బాధితుడు రామ్మోహన్ ఫిర్యాదుతో 4 గురు పై క్రైమ్ నెం :404/2025 కేసు నమోదు చేసిన ఈస్ట్ పోలీసులు…
ఏసిబి వలలో వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ నర్సింహారావు ఓ ఫర్టిలైజర్ షాప్ యజమాని నుండీ రూ 25 వేలు తీసుకుంటూ ఏసీబీ కి పట్టుబడ్డాడు. యూరియా అమ్మకాల కోసం షో కాజ్ నోటీసు ఇచ్చి దాన్ని ఉపాసంహరించుకునేందుకు రూ 25 వేలు తన కార్యాలయం విద్యానగర్ లో తీసుకుంటు ఉండగా ఏసీబీ డి ఎస్పీ వై. రమేష్ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు….
ప్రస్తుతం ఉన్న 26 జిల్లాలకు తోడుగా నూతనంగా మరో 6 జిల్లాలు ఏర్పాటు కానున్నాయా? కొత్త జిల్లాల కూర్పుపై ప్రభుత్వం ఇప్పటికే కసరత్తు మొదలెట్టిందా?..
అదేవిధంగా జిల్లా, మండలాలు, గ్రామాల పేర్లు మార్పునకు శ్రీకారం చుట్టనుందా? ఈ అంశాల అధ్యయనం కోసం మంత్రుల బృందం తో కూడిన మంత్రివర్గ ఉప సంఘాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేయడం.. ఈ క్రమంలోనే మంత్రుల బృందం జిల్లాల పర్యటన ఖరారు కావడంపై వాదనలకు బలాన్ని చేకూరుస్తుంది.
పరిపాలన సౌలభ్యం పేరిట..
గత వైసీపీ ప్రభుత్వం పరిపాలన సౌలభ్యం పేరిట 2022 సంవత్సరంలో ఏపీలో ఉమ్మడిగా ఉన్న 13 జిల్లాల స్థానంలో 26 జిల్లాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఒక పార్లమెంటు ప్రామాణికంగా చేసుకుని ఏర్పాటు చేసిన ఆయా జిల్లాల పరిధిలో కొత్తగా రెవెన్యూ డివిజన్లను సైతం ఏర్పాటు చేశారు. అలా కొత్తగా ఏర్పడిన జిల్లా కేంద్రాల నుంచే పరిపాలన సాగిస్తున్నారు. తాజాగా టీడీపీ ప్రభుత్వం జిల్లాలను పునర్ విభజించాలని నిర్ణయించింది. దీంతో ప్రస్తుతం ఉన్న జిల్లాలకు అదనంగా మరో 6 జిల్లాలను పెంచేందుకు కసరత్తు చేస్తోంది.
అధ్యయనానికి మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు..
ఏపీలో జిల్లాల పునర్విభజన చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఆయా ప్రాంతాల భౌగోళిక స్వరూపం, సాంస్కృతిక నేపథ్యం, సామాజిక, ఆర్థిక స్థితిగతుల తో పాటు జనాభా ప్రాతిపదికన పరిగణనలోకి తీసుకుని కొత్త జిల్లాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. వాటిని అధ్యయనం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేసింది. ఈ ఉప సంఘం మూడు బృందాలుగా విడిపోయి జిల్లాల పునర్విభజనపై అధ్యయనం చేయనుంది. ఏపీ రాజధాని అమరావతి తో పాటు ఆదోని, మార్కాపురం, పలాస, గూడూరు, మదనపల్లి ప్రాంతాలను జిల్లాలుగా ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 29 నుంచి మంత్రులు అనగాని సత్యప్రసాద్, బీసీ జనార్ధన్ రెడ్డి, అనిత, నిమ్మల రామానాయుడు, సత్యకుమార్ యాదవ్‌లు పర్యటించనున్నారు. 29, 30న శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పు గోదావరి, ప్రకాశం, నెల్లూరు జిల్లాలో.. సెప్టెంబర్ 2న అల్లూరి జిల్లాలో వీరు పర్యటించనున్నారు.
కొత్త జిల్లాల నమూనా స్వరూపం ఇలా...
అమరావతి జిల్లా…
అమరావతి జిల్లా కేంద్రంగా అమరావతి, పెదకూరపాడు, తాడికొండ, మంగళగిరి, జగ్గయ్యపేట, నందిగామ నియోజకవర్గాలు నూతన జిల్లాగా మారనున్నాయి.
పలాస జిల్లా…
పలాస, ఇచ్ఛాపురం, టెక్కలి, పాతపట్నం తో కలిపి పలాస జిల్లాగా ఏర్పాటు కానుంది.
మార్కాపురం జిల్లా…
మార్కాపురం, ఎర్రగొండపాలెం, గిద్దలూరు, కనిగిరి, దర్శితో మార్కాపురం జిల్లాగా ఏర్పడనుంది.
గూడూరు జిల్లా…
గూడూరు, వెంకటగిరి, సర్వేపల్లి, సూళ్లూరుపేట తో కలిపి గూడూరు జిల్లాగా ఏర్పాటు కానుంది.
మదనపల్లె జిల్లా…
మదనపల్లె, పీలేరు, పుంగనూరు, తంబళ్లపల్లితో కలిపి జిల్లాగా ఏర్పాటు కానుంది.
ఆదోని జిల్లా…
ఆదోని, పత్తికొండ, ఆలూరు, ఎమ్మిగనూరు, మంత్రాలయం నియోజకవర్గాలతో ఆదోని జిల్లాగా ఏర్పాటు కానుంది.
నియోజకవర్గాల పెంపు మరింత ఆలస్యం!
రాష్ట్రంలో 2014లో అమల్లోకి వచ్చిన రాష్ట్ర విభజన చట్టంలో ఏపీలోని అసెంబ్లీ స్థానాలను 175 నుంచి 225కు పెంచుకునే వెసులుబాటు కల్పించింది. కానీ ఆ తర్వాత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దీని గురించి పట్టించుకోలేదు. తాజాగా 2026 అక్టోబర్ నుంచి జనగణన చేపట్టాలని కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసింది. దీని ప్రకారం తొలిదశలో జమ్మూ కశ్మీర్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో జనాభా లెక్కల ప్రక్రియ చేపట్టనున్నారు. రెండో విడత.. 2027 మార్చి 1 నుంచి దేశవ్యాప్తంగా చేపట్టనున్నారు. దీన్ని బట్టి కొత్త నియోజకవర్గాల పెంపు మరింత ఆలస్యం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి..
ఆర్థికంగా రష్యాను ఇబ్బంది పెట్టేందుకే,భారత్ పై 25 శాతం ప్రతీకార సుంకం..అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్
రష్యా చమురు కొనుగోలు చేస్తున్నందుకు భారత్ పై 25 శాతం ప్రతీకార సుంకం విధించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయం సరైనదే అని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ అన్నారు..ఉక్రెయిన్ పై రష్యా చేస్తున్న యుద్ధాన్ని ముగించేలా ఒత్తిడి చేయడానికి తాము ఈ మార్గం అనుసరించినట్లు చెప్పుకొచ్చారు.
ఈ నెల ప్రారంభంలో అలాస్కాలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ను ట్రంప్ కలిసినప్పటి నుంచి తలెత్తిన తరువాత కొన్ని అవాంతరాలు ఉన్నాయని అయినప్పటికీ రష్యా- ఉక్రెయిన్ మధ్య శాశ్వత శాంతికి మధ్యవర్తిగా యుద్ధాన్ని ముగించగలమనే నమ్మకం ట్రంప్ పరిపాలన నమ్మకంగా ఉందని వాన్స్ పేర్కొన్నారు.ఉక్రెయిన్ పై బాంబు దాడులు ఆపివేస్తే వారిని(రష్యా) ప్రపంచ ఆర్థిక వ్యవస్థలోకి ఆహ్వానించవచ్చని, కానీ దాడులు ఆపకపోతే మాత్రం మాస్కో ఒంటరిగానే ఉంటుందని ట్రంప్ కు రష్యా స్పష్టం చేశారని కూడా ఆయన అన్నారు.”రష్యా, ఉక్రెయిన్ లో హత్యాకాండను ఆపివేస్తే వారిని తిరిగి ప్రపంచ ఆర్థిక వ్యవస్థలోకి ఆహ్వానించవచ్చని అధ్యక్షుడు చాలా స్పష్టంగా చెప్పారు. కానీ వారు(రష్యా) అలా చేయకపోతే వారు ఒంటరిగానే ఉంటారు” అని వాన్స్ హెచ్చరించారు.అమెరికా దళాలు లేవు..ఉక్రెయిన్ కు అమెరికా సైన్యాన్ని పంపదని వాన్స్ స్పష్టం చేశారు. అలాంటి మోహరింపుకు ట్రంప్ వ్యతిరేకంగా ఉన్నారు. ”అధ్యక్షుడు చాలా స్పష్టంగా చెప్పారు. ఉక్రెయిన్ లో ఎటువంటి దాడి జరగబోదు. కానీ ఉక్రెనియన్లకు భద్రత హమీలు, యుద్ధాన్ని ఆపడానికి అవసరమైన విశ్వాసం ఉండేలా చూసుకోవడంలో మేము చురుకైన పాత్ర పోషిస్తునే ఉంటాము. రష్యన్లు తమ వైపు యుద్ధాన్ని ముగింపుకు తీసుకురాగలరని భావిస్తున్నాను” అని వాన్స్ అన్నారు.ట్రంప్ వ్యాఖ్యలు ఖండించిన జైశంకర్..భారత్ రష్యా చమురును అత్యధికంగా దిగుమతి చేసుకునే దేశం అనే ట్రంప్ వాదనను విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ తోసిపుచ్చిన కొన్ని రోజుల తరువాత వాన్స్ ఈ వ్యాఖ్య చేశారు. ఆ ప్రత్యేకత చైనాకే చెందుతుందని ఆయన అన్నారు.రష్యా- ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థను స్థిరీకరించడానికి రష్యా చమురును కొనుగోలు చేయాలని భారత్ ను కోరింది అమెరికాయే అని జైశంకర్ చెప్పారు.భారత్ నుంచి ముడి చమురు లేదా శుద్ది చేసిన ఉత్పత్తులను కొనుగోలు చేయడంలో ఎవరికైనా సమస్య ఉంటే వారు వాటిని కొనడం మానేయాలని ట్రంప్ పరిపాలనకు స్పష్టమైన సందేశం పంపాలని కూడా ఆయన స్పష్టం చేశారు..
ప్రధాని పెద్ద అబద్దాలకోరు..కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ.
బిహార్(Bihar)లో ”ఓటర్ అధికార్ యాత్ర”లో ఉన్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) తన ఆరోపణలకు పదునుపెట్టారు. భారతీయ జనతా పార్టీ (BJP), ఎలక్షన్ కమిషన్(EC)పై విరుచుకుపడ్డారు…ఈసీతో కుమ్మకై ఓటరు జాబితా సవరణ ప్రక్రియ (SIR)ను తీసుకొచ్చి.. ప్రతిపక్ష ఓటర్లను తొలగించడం ద్వారా బీహార్‌లో ఎన్డీఏ కూటమి మళ్లీ అధికారంలోకి రావాలని చూస్తోందని ఆరోపించారు.
యాత్రలో భాగంగా అరారియాలో భాగస్వామ్య ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్, వికాస్‌షీల్ ఇన్సాన్ పార్టీ చీఫ్ ముఖేష్ సాహ్ని, సీపీఐ-ఎంఎల్‌ఎల్‌కు చెందిన దీపాంకర్ భట్టాచార్యతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో లోక్‌సభా ప్రతిపక్ష నేత మాట్లాడారు. “ఎన్నికల కమిషన్, ఎన్నికల కమిషనర్లు, బీజేపీకి మధ్య లోపాయికారీ ఒప్పందం” ఉందని ఆరోపించారు. బీహార్‌లో SIR తర్వాత సుమారు 65 లక్షల మంది ఓటర్లను జాబితా నుంచి తొలగించినా.. బీజేపీ ఈసీకి ఎందుకు ఫిర్యాదు చేయలేదని ప్రశ్నించారు. “చనిపోయిన వ్యక్తుల కుటుంబసభ్యులు, ఇప్పటికే నాలుగైదు సార్లు ఓటు హక్కు వినియోగించుకున్న వారు యాత్రలో నన్ను కలుస్తున్నారు. తమ పేర్లు గల్లంతయ్యాయని చెబుతున్నారు. బీజేపీ ఓట్ల దొంగతనంపై బీహార్‌లో ఉంటున్న ప్రతి ఒక్క ఓటరుకు తెలుసు” అని పేర్కొ్న్నారు. విలేఖరుల సమావేశానికి ముందు రాహుల్, తేజస్వి బైక్‌లపై ప్రయాణించారు. వీద్దరినికి చూసేందుకు జనం భారీగా రోడ్లకు ఇరువైపులా బారులు తీరారు.
”ప్రధాని పెద్ద అబద్దాలకోరు”
ప్రధాని మోదీని తీవ్రంగా విమర్శిస్తూ తేజస్వి ఇలా అన్నారు.. “ఈ రోజు దేశంలో ప్రధాని కంటే అబద్ధాలకోరు మరొకరు ఉండరు. మొన్న గయలో ఆయన చొరబాటుదారుల పేర్లను మాత్రమే తొలగిస్తున్నారని చెప్పడం ద్వారా SIRను వెనకేసుకొచ్చేందుకు ప్రయత్నించారు. అయితే సుప్రీంకోర్టుకు ఇచ్చిన అఫిడవిట్లో EC చొరబాటుదారుల గురించి ఎక్కడా ప్రస్తావించలేదు.” అని పేర్కొన్నారు.
ఓటర్ అధికార్ యాత్ర ఆగస్టు 17న ససారాం నుంచి మొదలైన విషయం తెలిసిందే. SIRకు వ్యతిరేకంగా 20కి పైగా జిల్లాలను కలుపుతూ జరిగే 1300 కి.మీ రాహుల్ యాత్ర సెప్టెంబర్ 1న పాట్నాలో మెగా ర్యాలీతో ముగుస్తుంది..