సక్సెస్ కోసం పడుకున్నా తప్పులేదు..

పని చేసే ప్రతిచోట అమ్మాయిలు అభద్రతా భావంతో ఉన్నారని ఇటీవల ఓ సర్వేలో తేలింది. ఇక సినిమా ఇండస్ట్రీలో లైంగిక వేధింపుల గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. సౌత్‌లో పోలిస్తే నార్త్‌లో హీరోయిన్స్‌కు, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌లకు లైంగిక వేధింపులు అధికంగానే ఉంటాయి.కొందరు నటులు గతంలో తమకు ఎదురైన వేధింపులు గురించి బహిరంగంగానే చెబుతున్నారు. తమకు ఎదురైన లైంగిక వేధింపులు ,కాస్టింగ్ కౌచ్‌, కమింట్మెంట్‌ల గురించి హీరోయిన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులు ఇటీవల పలు సందర్భాల్లో వెల్లడిస్తున్నారు..కమిట్‌మెంట్ ఇచ్చినప్పటికీ ఆఫర్స్ రావడం లేదని ఇటీవలే ఓ తెలుగు నటి వెల్లడించారు. తాజాగా ఓ హీరోయిన్ కమింట్మెంట్‌ గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది. హీరోయిన్ దీక్షా పంత్ తెలుగులో ఒకప్పుడు మంచి గుర్తింపు ఉంది. స్పెషల్ సాంగ్స్‌తో పాటు, కొన్ని వెబ్ సిరీస్‌ల్లో కూడా ఈ అమ్మడు నటించింది. సినిమాల్లో అవకాశాలు తగ్గిపోవడంతో తెలుగు రియాల్టీ షో బిగ్‌బాస్‌లో అడుగుపెట్టింది. బిగ్‌బాస్ షోతో దీక్షా పంత్ ‌కు మంచి క్రేజ్ వచ్చింది…తాజాగా దీక్షా పంత్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన కెరీర్ ఇంకా పుంజుకోలేదని తెలిపింది. ఈ సమయంలో ఆమె కమింట్మెంట్‌‌పై చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి.సినీ పరిశ్రమలో ‘సెక్స్-సక్సెస్’ మధ్య ఉన్న సంబంధం గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇండస్ట్రీలో సెక్స్ ఇస్తే సక్సెస్ ఇస్తారనే కల్చర్‌పై ఆమె అభిప్రాయం అడగ్గా, ఇద్దరికీ ఇష్టం ఉన్నప్పుడు సెక్స్, సక్సెస్ హ్యాండ్ ఇన్ హ్యాండ్ తీసుకోవడంలో తప్పేముంది? దీని గురించి మనం ప్రశ్నించేదానికి మనమెవరం? అని అన్నారు. అయితే, తాను మాత్రం అలా ఎప్పుడూ చేయలేదని, అందుకే సినీ పరిశ్రమలో విజయం సాధించలేదని దీక్ష స్పష్టం చేశారు. కొత్తగా ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు ఇలాంటి ‘కాస్టింగ్ కౌచ్’ అనుభవాలు రెండుసార్లు ఎదురయ్యాయని, కానీ తాను వాటిని పట్టించుకోలేదని తెలిపారు..