Latest news… నేటి ప్రధాన ముచ్చట్లు..!

అమెరికాకు, జపాన్‌ షాక్

ప్రధాని మోదీ (PM Modi) పర్యటన వేళ సుంకాలతో విరుచుకుపడుతున్న అమెరికాకు (America) జపాన్‌ (Japan) షాకిచ్చింది. పెట్టుబడులపై చర్చించేందుకు అగ్రరాజ్యంలో పర్యటించాల్సిన జపాన్‌ వాణిజ్య మంత్రి చివరి నిమిషంలో తన పర్యటనను రద్దు చేసుకున్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ (Trump Tariffs) జపాన్‌పై 25 శాతం సుంకాలు విధించారు. దీంతో ఆ దేశంలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు టోక్యో నిర్ణయించింది. ఇందులో భాగంగా 550 బిలియన్‌ డాలర్ల మేర పెట్టుబడులు (Trade Deal) పెట్టేందుకు సిద్ధమైంది. దీనికి సంబంధించి ఇరు దేశాలు ఇప్పటికే చర్చలు ప్రారంభించాయి. దీంతో సుంకాలను 25 శాతం నుంచి 15 శాతానికి తగ్గించాలని నిర్ణయించింది..రెండు రోజుల పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ టోక్యో చేరుకున్నారు. శుక్రవారం ఉదయం ఆయన టోక్యో విమానాశ్రయంలో దిగారు. ఇరుదేశాల 15వ వార్షిక శిఖరాగ్ర సదస్సులో పాల్గొంటారు. అనంతరం జపాన్‌ ప్రధాని ఇషిబాతో భేటీ కానున్నారు. ఏఐ, సెమీకండక్టర్లు, బుల్లెట్‌ రైలు, పెట్టుబడులే అజెండాగా వీరి మధ్య ద్వైపాక్షిక చర్చ జరగనుంది. అక్కడి నుంచి ప్రధాని మోదీ చైనా వెళ్లనున్నారు. ఆగస్టు 31, సెప్టెంబర్‌ 1వ తేదీల్లో తియాంజిన్‌ వేదికగా జరిగే షాంఘై సహకార సంస్థ (SCO) శిఖరాగ్ర సదస్సులో పాల్గొంటారు..

▪️యాదాద్రి జిల్లాలో ఉధృతంగా ప్రవహిస్తున్న మూసీ
జూలూరు దగ్గర బ్రిడ్జి పైనుంచి ప్రవహిస్తున్న వరద
పోచంపల్లి-బీబీనగర్ మధ్య నిలిచిపోయిన రాకపోకలు..వలిగొండ మండలం సంగెం దగ్గర మూసీ వరద ఉధృతి..భీమలింగం దగ్గర లోలెవల్ బ్రిడ్జిపైనుంచి వరద ప్రవాహం..చౌటుప్పల్-భువనగిరి మధ్య రాకపోకలు బంద్..

▪️ఢిల్లీలో కర్నాటక ప్రభుత్వం ఆధ్వర్యంలో సమావేశం..

జీఎస్టీ సంస్కరణల నేపథ్యంలో సమావేశం ఏర్పాటు
సమావేశంలో పాల్గొన్న తెలంగాణ ఆర్థిక మంత్రి భట్టి..

▪️విజయవాడ: ఇంద్రకీలాద్రిపై అమల్లోకి కొత్త నిబంధనలు
కనకదుర్గమ్మ దర్శనానికి ఇకపై డ్రెస్ కోడ్ తప్పనిసరి
ఆలయం లోపల సెల్‌ఫోన్లు నిషేధం..సెప్టెంబర్ 27 నుంచి భక్తులు తప్పనిసరిగా సంప్రదాయ దుస్తులు ధరించాలి. ఒకవేళ సంప్రదాయ దుస్తులు లేకపోతే ఆలయంలోకి ప్రవేశం ఇవ్వబోమని ఆలయ అధికారులు స్పష్టం చేశారు. అదే విధంగా, ఆలయంలో సెల్ఫోన్ వాడకంపై నిషేధం విధించారు. ఇటీవల భక్తులు సంప్రదాయ దుస్తులు ధరించకపోవడం, అంతరాలయంలో వీడియోలు తీసి సోషల్ మీడియాలో వైరల్ చేయడం వంటి ఘటనలు గుర్తించడంతో ఈ చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఆలయ సాంప్రదాయాలకు భంగం కలగకుండా కఠిన నిబంధనలు అమలు చేయాలని అధికారులు నిర్ణయించారు. అంతేకాకుండా, ప్రోటోకాల్ దర్శనాలకు వచ్చే వారు ఆలయ ఆఫీసులోనే ఫోన్లు డిపాజిట్ చేయాల్సి ఉంటుందని తెలిపారు. భక్తులు, ఉద్యోగులందరూ సాంప్రదాయ దుస్తులు ధరించడం ఇకపై తప్పనిసరి కానుంది. ఆలయ సిబ్బంది తప్పనిసరిగా ఐడీ కార్డులు ధరించాలని.. అలాగే స్కానింగ్ పాయింట్, టికెట్ కౌంటర్ వద్ద కఠిన తనిఖీలు జరగనున్నాయని అధికారులు తెలిపారు. ఇకపై డ్రెస్ కోడ్ లేకపోయినా, సెల్ఫోన్ తీసుకవచ్చే వారిని ఆలయంలోకి అనుమతి ఉండదని అధికారులు స్పష్టం చేశారు..

▪️HYD: ఫెర్టిలిటీ సెంటర్లలో కొనసాగుతున్న తనిఖీలు
సృష్టి కేసులో మరో ఏడు కేసులు నమోదు చేసిన సీసీఎస్‌…., పిల్లల అక్రమ విక్రయం ఈ కేసులో ప్రధాన అంశాలు. ఈ వ్యవహారంలో కొందరిని అరెస్ట్ చేశారు. తాజాగా.. ఈ కేసులో కీలకంగా ఉన్న డాక్టర్ నమ్రతతో పాటు మరో ఏడుగురిని అరెస్ట్ చేశారు. దీంతో మొత్తం అరెస్టుల సంఖ్య 24కు చేరింది. ఇందులో లేడీ డాక్టర్ విద్యుల్లత కూడా ఉన్నారు. ఆమె విదేశాలకు పారిపోయేందుకు ప్రయత్నిస్తుండగా అదుపులోకి తీసుకున్నారు..

▪️తెలంగాణలో భారీ వర్షాలతో దెబ్బతిన్న రహదారులు.
భారీ వర్షాల నేపథ్యంలో కామారెడ్డి జిల్లాలోని 44వ నంబరు నేషనల్ హైవేపై భారీగా ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. రోడ్డు కోతకు గురికావడం వల్ల వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఫలితంగా హైదరాబాద్‌ నగరం నుంచి ఆదిలాబాద్‌ వైపు వెళ్తున్న వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. సుమారు గంటకు పైగా ఇలాంటి పరిస్థితి నెలకొంది. సదాశివనగర్‌ మండలం నుంచి భిక్కనూర్‌ టోల్‌గేట్‌ వరకు సుమారు 15 కి.మీ మేర దారిపొడవునా వాహనాలు నిలిచిపోయాయి..

1039 కి.మీ మేర రోడ్లు దెబ్బతిన్నట్టు గుర్తింపు
31 చోట్ల తెగిపడ్డ రహదారులు
10 చోట్ల తాత్కాలికంగా రోడ్ల పునరుద్ధరణ
తాత్కాలిక పునరుద్ధరణ పనులకు రూ.53.76 కోట్ల ఖర్చు
శాశ్వత పునరుద్ధరణ పనులకు..
రూ.1157.46 కోట్లు అవసరమని ఆర్‌అండ్‌ అధికారుల అంచనా.

▪️లాభాల్లో దేశీయ స్టాక్‌మార్కెట్లు
సెన్సెక్స్‌ 120, నిఫ్టీ 35 పాయింట్ల లాభం..

నేటి బంగారం ధర హైదరాబాద్‌లో ఎంతంటే.

ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటాము. ఇక అందులోనూ మన దేశంలో గోల్డ్‌కి మరింత పాపులారిటీ ఎక్కువ. ఇక ఈ మధ్య కాలంలో బంగారం ధరల్లో హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఒకరోజు రేట్లు తగ్గి కాస్త ఊరటనిస్తుంటే మరోరోజు పెరిగి అమ్మో అనిపిస్తున్నాయి. ఈ క్రమంలో మూడు రోజులుగా పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు నేడు కూడా స్వల్పంగా పెరిగాయి . నేడు కూడా పసిడి ప్రియులకు బంగారం ధరలు పెరిగి బిగ్ షాకిచ్చాయి. ఇక ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో నిన్న రూ.94,050 ఉన్న 22 క్యారెట్ల బంగారం ధరపై నేడు రూ.10 పెరిగి రూ.94,060గా ఉంది. అలాగే నిన్న రూ.1,02,600 ఉన్న 24 క్యారెట్ల బంగారం ధరపై రూ.10 పెరిగి నేడు రూ.1,02,610గా ఉంది. ఇక అటు వెండి ధర రూ.100 తగ్గి కిలో రూ.1,29,900గా ఉంది. కాగా దాదాపు రెండు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఇవే ఉన్నాయి.

నేటి బంగారం ధర హైదరాబాద్‌లో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర – రూ.94,060

24 క్యారెట్ల బంగారం ధర – రూ.1,02,610

నేటి బంగారం ధర విజయవాడలో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర – రూ.94,060

24 క్యారెట్ల బంగారం ధర – రూ.1,02,610