నిరుద్యోగులకు గుడ్ న్యూస్ ..

10th Pass Govt Jobs 2025 Apply: నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది పశ్చిమబెంగాల్ సర్కార్. 8477 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. బోధనేతర సిబ్బంది పోస్టులకు ఈ నియామకాలను చేపట్టింది. సెప్టెంబర్ 16వ తేదీ నుంచి అధికారిక వెబ్ సైట్ లో దరఖాస్తు ప్రారంభమై అక్టోబర్ 31వ తేదీ చివరి తేదీగా పేర్కొంది. …ప్రభుత్వ ఉద్యోగమే లక్ష్యంగా ప్రిపేర్ అవుతున్న నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది వెస్ట్ బెంగాల్ సర్కార్. పశ్చిమ బెంగాల్ స్కూల్ సర్వీస్ కమిషన్ (WBSSC) ప్రభుత్వ, ఎయిడెడ్ సెకండరీ, హయ్యర్ సెకండరీ పాఠశాలల్లో బోధనేతర ఉద్యోగాలకు పెద్ద సంఖ్యలో నియామకాలను విడుదల చేసింది . 8477 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. దరఖాస్తులు సెప్టెంబర్ 16 నుండి అధికారిక వెబ్‌సైట్ wbssc.gov.inలో ప్రారంభమవుతాయని పేర్కొంది. దరఖాస్తులకు చివరి తేదీ 31 అక్టోబర్ 2025. బోధనేతర పోస్టుల కోసం పశ్చిమ బెంగాల్ స్కూల్ సర్వీస్ కమిషన్ 8477 పోస్టుల కోసం ఈ నియామకాలను ప్రారంభించింది. ఇందులో గ్రూప్ C, D పోస్టులు రెండూ ఉన్నాయి. గ్రూప్ సిలో 2,989 పోస్టులు.. గ్రూప్ డి లో 5,488 పోస్టులు .. మొత్తం పోస్టుల సంఖ్య 8477లను భర్తీ చేస్తున్నట్లు ప్రకటించింది…