సెప్టెంబర్ 7వ తేదిన ఎరుపు రంగులో చంద్రుడు..ఈ నెల 7 న సంపూర్ణ చంద్రగ్రహణం…పాటించాల్సిన నియమాలు ఇవే!

ఈ నెల 7 న సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఆ రోజు రాత్రి 8.58 గంటలకు ప్రారంభమై మరుసటి రోజు తెల్లవారు జామున 1.25 గంటల వరకు ఉంటుంది. ఆ రోజు చందమామ ఎరుపు రంగులో ఉంటాడు. దీంతో చంద్రుడిని బ్లడ్ మూన్ కూడా పిలుస్తారు. మన దేశంలో ఢిల్లీ, ముంబై, కోల్కతా, పుణే, లక్నో, హైదరాబాద్, చండీగఢ్ ప్రాంతాలవారు దీనిని వీక్షించవచ్చు. ఆస్ట్రేలియా, అమెరికా, న్యూజిలాండ్ వంటి దేశాల్లో నేరుగా, స్పష్టంగా చూడొచ్చు……. అలాగే మన దేశంతో పాటు ఆసియా, ఆస్ట్రేలియా, అమెరికా, న్యూజిలాండ్‌ వంటి దేశాల్లో కూడా ఈ చంద్ర గ్రహణం (Lunar Eclipse 2025) చూడొచ్చు. ఈసారి చంద్ర గ్రహణం (Chandra Grahanam 2025) సెప్టెంబర్ 7న రాత్రి 9:58 గంటలకు ప్రారంభం అవుతుంది. సెప్టెంబర్ 8వ తేదీ తెల్లవారుజామున 1:26 గంటలకు ముగియనుంది. ఈ చంద్ర గ్రహణం రోజు చంద్రుడు ఎరుపు రంగులో ఉంటాడు. కాబట్టి చంద్రుడిని బ్లడ్ మూన్ అని కూడా పిలుస్తారు. ఇది ఈ ఏడాది రెండోది అంటే చివరి చంద్ర గ్రహణం..

చంద్ర గ్రహణం ఏర్పడటానికి 9 గంటల ముందు సూతక కాలం మొదలవుతుంది. అంటే.. సెప్టెంబర్‌ 7వ తేదీ మధ్యాహ్నం 12.57 గంటల నుంచి సూతక కాలం ప్రారంభమవుతుంది. ఈ సూతక కాలంలో ఆలయాల తలుపులు మూసివేస్తారు, పూజలు చేయరు. గ్రహణం ముగిసిన తర్వాత ఆలయాలను, ఇంటిని శుభ్రం చేసి పూజలు చేస్తారు..

చంద్ర గ్రహణం రోజు సూతక కాలంలో కొన్ని నియమాలు పాటించాల్సి ఉంటుంది. అవేమిటంటే.. సూతక కాలంలో గ్రహణం ముగిసే వరకు ఆహారం తీసుకోరు. ఆరోగ్యం సరిగా లేని వారు ఆహారం తీసుకోకుండా ఉండలేకపోతే పాలు, పండ్ల రసం వంటివి తీసుకుంటారు. అలాగే గ్రహణానికి ముందు వండిన ఆహారంపై దర్భ గడ్డి లేదా తులసి ఆకులు వేయడం వల్ల ఆహారం కలుషితం కాకుండా ఉంటుందని నమ్మకం..

అలాగే ఈ గ్రహణం సమయంలో శుభకార్యాలు, పూజలు, దేవాలయ దర్శనాలు చేయరు. అలాగే గర్భణీ స్త్రీలు ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో వీలైనంత వరకు భగవంతుడిని స్మరించడం, మంత్రాలను జపించడం, ధ్యానం చేయడం వంటివి మంచివి…గ్రహణం ముగిసిన వెంటనే తలస్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించాలి. ఇంటిని, పూజ గదిని శుభ్రం చేయాలి. పేదలకు బట్టలు, ఆహారం, ధాన్యం, శక్తిమేర డబ్బు దానం చేయాలి. సమీపంలో ఉన్న దేవాలయానికి వెళ్లి దైవ దర్శనం చేసుకోవడం మంచి ఫలితాలను ఇస్తుంది. ఈ నియమాలను పాటించడం వల్ల గ్రహణం దుష్ప్రభావాలు దరిచేరవని నమ్మకం. అలాగే పితృపక్షం కారణంగా గ్రహణం రోజు దానం చేయడం వల్ల అనేక రెట్లు శుభ ఫలితాలు కలుగుతాయట. ఇక తెల్లని వస్తువులు దానం చేయడం వల్ల కూడా మంచి ఫలితాలు ఉంటాయని విశ్వాసం..