విద్యార్థులు వర్షంలో ఆడుతుండగా పడిన భారీ పిడుగు ….
ఉత్తరప్రదేశ్ బస్తీ జిల్లాలో కిసాన్ డిగ్రీ కాలేజీ మైదానంలో విద్యార్థులు వర్షంలో ఆడుకుంటున్న సమయంలో కాలేజీ ప్రాంగణంలోని చెట్టుపై ఆకస్మికంగా పిడుగు పడింది. భయాందోళనకు గురైన విద్యార్థులు అక్కడి నుంచి పరుగులు తీసి సురక్షితంగా బయటపడ్డారు. అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణాపాయం సంభవించలేదు. ఈ దృశ్యం కెమెరాలో రికార్డు కావడంతో సోషల్ మీడియాలో వీడియో వైరల్గా మారింది….