కెసిఆర్ వారి వల్లనే ఆగం అవుతున్నారు.!.

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. కాళేశ్వరంలో చిన్న భాగం కుంగితే మొత్తం ప్రాజెక్టు పోయినట్టు చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. జస్టిస్ పీసీ ఘోష్ కమిటీ నివేదిక ఆధారంగా ప్రభుత్వం కాళేశ్వరం అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలని నిర్ణయించిన నేపథ్యంలో ఆమె స్పందించారు. ఎవరి వల్ల, ఎందుకోసం మాజీ సీఎం కేసీఆర్‌కు అవినీతి మరక అంటిందో గుర్తించాలని ఆమె సూచించారు. కేసీఆర్ పక్కనున్న కొందరు చేసిన పని వల్ల ఆయనకు చెడ్డపేరు వచ్చిందని అన్నారు. కాళేశ్వరం విషయంలో ఐదేళ్లు ఇరిగేషన్‌ మంత్రిగా ఉన్న హరీశ్‌రావు పాత్ర లేదా అని కవిత ప్రశ్నించారు…
కాళేశ్వరంలో పనిచేసిన ముగ్గురు ఇంజినీర్ల వద్ద వందలకోట్ల సంపద ఉందని, కాళేశ్వరం ఇంజినీర్ల ఆస్తులపై ఎందుకు విచారణ జరిపించట్లేదని, ఏసీబీకి చిక్కిన ఇంజినీర్ల వెనుక ఎవరున్నారో ఎందుకు విచారణ చేయట్లేదని కవిత నిలదీశారు. బీఆర్‌ఎస్‌ను ఇబ్బందులకు గురిచేసిన అవినీతి అనకొండలను ఉపేక్షించొద్దని కోరారు. హరీశ్‌రావు, సంతోష్‌ వెనుక రేవంత్‌రెడ్డి ఉన్నారని, కాపాడుతున్నారని, వాళ్ల సోషల్‌ మీడియా బ్యాచ్‌ రేపట్నుంచి తనపై దుష్ప్రచారం చేస్తారని, సోషల్‌ మీడియాలో తనపై నరకం చూపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు కేసీఆర్‌ అంటే మహానాయకుడు అని దేశవ్యాప్త పేరు ఉందని, రేపట్నుంచి కేసీఆర్‌ పేరు చెబితే సీబీఐ పేరు కూడా వినిపిస్తుందని, పెద్దసార్‌ వద్దకు వచ్చాక కాంప్రమైజ్‌ అయ్యే పరిస్థితి ఉండదని స్పష్టం చేశారు. తనని రేవంత్‌రెడ్డి, బీజేపీ, బండి సంజయ్‌ నడిపిస్తున్నారని రేపట్నుంచి అంటారని జోస్యం చెప్పారు. తాను కేసీఆర్‌ బిడ్డను బడ్దార్‌ ఒకరు నడిపిస్తే నడిచే వ్యక్తిని కాదని వెల్లడించారు..కాళేశ్వరంలో చిన్న భాగం కుంగితే మొత్తం ప్రాజెక్టు పోయినట్టు చేస్తున్నారు. ఎవరి వల్ల, ఎందుకోసం కేసీఆర్‌కు అవినీతి మరక అంటింది. కేసీఆర్ పక్కనున్న కొందరు చేసిన పని వల్ల ఆయనకు చెడ్డపేరు. ఐదేళ్లు ఇరిగేషన్‌ మంత్రిగా ఉన్న హరీశ్‌రావు పాత్ర లేదా?. హరీశ్‌రావు, సంతోష్‌ వెనుక రేవంత్ రెడ్డి ఉన్నారు. నా తండ్రిపైనే బాణం వేస్తారు. కాళేశ్వరంలో పనిచేసిన ముగ్గురు ఇంజినీర్ల వద్ద వందలకోట్ల సంపద ఉంది. కేసీఆర్ మీద సీబీఐ దర్యాప్తు వేశాక పార్టీ ఉంటే ఏమిటీ? లేకపోతే ఏంటీ? కేసీఆర్‌ దాకా వచ్చాక పార్టీ ఉంటే ఏంటి? పోతే ఏంటీ? అంటు విమర్శలు గుపించ్చారు….మాజీ ఎంపీ సంతోష్‌ కుమార్, హరీశ్‌రావు, మేఘా ఇంజినీరింగ్ వల్లే కేసీఆర్‌కు చెడ్డపేరు వచ్చిందని కవిత ఆరోపించారు. కేసీఆర్ జనం కోసం పనిచేస్తే వాళ్లు సొంత ఆస్తులు పెంపు కోసం పని చేశారని ఆమె మండిపడ్డారు. హరీశ్‌రావు, సంతోష్ తనపై ఎన్నో సార్లు కుట్రలు చేశారని కవిత ఆరోపించారు. తనపై ఎన్ని కుట్రలు చేసినా ఏం మాట్లాడినా నోరు మెదపలేదని, కానీ ఈరోజు కేసీఆర్‌ బిడ్డగా ఎంతో బాధపడుతున్నట్లు తెలిపారు. హరీశ్‌రావు, సంతోష్‌ వెనుక సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారని కవిత విమర్శించారు..