వాట్సప్ గ్రూప్‌ల నుంచి కవిత పీఆర్వో తొలగింపు :
బీఆర్ఎస్ అధికారిక వాట్సప్ గ్రూప్‌ల నుంచి కవిత పీఆర్వోను ఆ పార్టీ తొలగించింది. కవిత ప్రెస్‌నోట్, వీడియో క్లిప్పులను సైతం వాట్సప్ గ్రూప్‌ల నుంచి తొలగించింది. అంతేకాకుండా హరీశ్‌రావు, సంతోష్‌కు వ్యతిరేకంగా ఉన్న వ్యాఖ్యల సారాంశాన్ని కూడా బీఆర్ఎస్ డిలీట్ చేసింది.
ఆధారాలతో సహా తిప్పికొట్టారు : అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై నిన్న మాట్లాడిన హరీశ్‌రావుకు మద్దతుగా బీఆర్ఎస్ ఎక్స్‌లో పోస్టు చేసింది. ఇది ఆరడుగుల బుల్లెట్టు అంటూ ఎక్స్‌లో రాసుకొచ్చింది. సింహం సింగిల్‌గానే వస్తుందంటూ హరీశ్‌రావును ఉద్దేశించి పోస్టు చేసింది. కాళేశ్వరంపై కాంగ్రెస్ ప్రచారాన్ని ఆధారాలతో సహా తిప్పికొట్టారని తెలిపింది.