భారత్‌-నేపాల్‌ బార్డర్‌ వద్ద హైఅలర్ట్‌…!

హిమాలయ దేశం నేపాల్‌ (Nepal)లో అవినీతిపై యువత కదం తొక్కింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నేపాలీ యువత చేపట్టిన ఆందోళనలు ఉధృతమయ్యాయి. వేల మంది ఆందోళనకారులు రోడ్లపైకి వచ్చి నిరసన వ్యక్తంచేస్తున్నారు. కర్ఫ్యూని సైతం లెక్కచేయకుండా వీధుల్లోకి వచ్చి రహదారులను దిగ్బంధించారు..నేపాల్‌ అధ్యక్షుడు, ప్రధాని, పార్లమెంట్‌, సుప్రీంకోర్టు సహా మంత్రులు, ఇతర రాజకీయ నేతల ఇండ్లను లక్ష్యంగా చేసుకొని దాడులకు తెగబడుతున్నారు. భక్తపూర్‌ (Bhaktapur)లోని ప్రధాని కేపీ శర్మ ఓలి (PM K.P. Sharma Oli) ప్రైవేట్‌ నివాసంపై దాడి చేసిన నిరసనకారులు.. దానికి నిప్పు పెట్టారు. అనంతరం డ్యాన్స్‌ చేస్తూ సంబరాలు చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌ అవుతోంది..యువత ఆందోళనలతో రాకీయ సంక్షోభం తలెత్తింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చెలరేగడంతో నేపాలీ ప్రధాని ఈ మధ్యాహ్నం తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. దేశంలో జరుగుతున్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో సైన్యం సూచన మేరకు ఆయన ప్రధాని పదవి నుంచి వైదొలిగారు. ఆయన దేశం విడిచి వెళ్లే పరిస్థితి ఏర్పడింది. మరోవైపు ఇవాళ సాయంత్రం కొత్త ప్రధాని (New Pirme Minister) ని ప్రకటించే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి..

భారత్‌-నేపాల్‌ బార్డర్‌ (India-Nepal border) వద్ద పోలీసులు హైఅల

ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్‌ అప్రమత్తమైంది. భారత్‌-నేపాల్‌ బార్డర్‌ (India-Nepal border) వద్ద పోలీసులు హైఅలర్ట్‌ అయ్యారు. పశ్చిమ బెంగాల్‌లోని నేపాల్‌ సరిహద్దు పానిటాంకి వద్ద పోలీసు పోస్టును ఏర్పాటు చేశారు. అక్కడికి అదనపు బలగాలను మోహరించినట్లు ఎస్పీ ప్రవీణ్‌ ప్రకాష్‌ తెలిపారు. బార్డర్‌ వద్ద అధికారులు అప్రమత్తంగా ఉన్నట్లు చెప్పారు. ప్రస్తుత పరిస్థితులను నిశితంగా పర్యవేక్షిస్తున్నట్లు వెల్లడించారు.

భారతీయులకు కీలక అడ్వైజరీ

మరోవైపు యువత ఆందోళనతో భారత్‌ (India) అప్రమత్తమైంది. ఈ మేరకు నేపాల్‌లోని భారతీయులకు కీలక అడ్వైజరీ జారీ చేసింది. ప్రస్తుతం అక్కడ జరుగుతున్న పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నట్లు తెలిపింది. అక్కడ భారతీయ పౌరులు జాగ్రత్తగా, సురక్షితంగా ఉండాలని సూచించింది. స్థానిక అధికారుల మార్గదర్శకాలను పాటించాలని పేర్కొంది. ఈ మేరకు విదేశాంగ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. ‘నిన్నటి నుంచి నేపాల్‌లో జరుగుతున్న పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నాము. చాలా మంది యువకులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాం. రాజధాని కాఠ్మాండు సహా అనేక నగరాల్లో అధికారులు కర్ఫ్యూ విధించారు. నేపాల్‌లోని భారతీయ పౌరులు జాగ్రత్తగా ఉండాలి. అక్కడి అధికారులు జారీ చేసిన మార్గదర్శకాలను పాటించాలి’ అని ప్రకటనలో తెలిపింది.