పార్టీ మారిన ఎమ్మెల్యేలు నిజంగా మా పార్టీలోనే ఉంటే, ఎందుకు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు… కేటీఆర్..

పార్టీ మారిన ఎమ్మెల్యేలు నిజంగా మా పార్టీలోనే ఉంటే,

ఎందుకు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు.

ఎందుకు శాసనసభలో మా వైపు కూర్చోవడం లేదు..

BRS పార్టీ ఆఫీసుకు ఎందుకు రావడం లేదు….
పార్టీ మారిన MLA లు స్త్రీ లింగమా,, లేక పురుష లింగమా చెప్పుకోలేకపోతున్నారు.

https://youtu.be/-TMW2Eil1-Y
పాల‌మూరు ఎత్తిపోత‌ల ద్వారా కొడంగ‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలో 2 ల‌క్ష‌ల ఎకరాలు, రంగారెడ్డి జిల్లాలో 6 ల‌క్ష‌ల ఎక‌రాల‌కు నీళ్లు అందించే అవ‌కాశం ఉంది. కానీ సీఎం రేవంత్ రెడ్డి శ్రీశైలం నుంచి జూరాల‌కు సోర్స్ మార్చి కొడంగ‌ల్ – నారాయ‌ణ‌పేట ఎత్తిపోత‌ల ప‌థ‌కానికి రూ. 4 వేల కోట్ల‌తో ప్ర‌త్యేక టెండ‌ర్లు పిలిచారు. ఈ ప్రాజెక్టుకు ఎలాంటి అనుమ‌త‌ల్లేవు. కొడంగ‌ల్ ఎత్తిపోత‌ల‌పై గ్రీన్ ట్రిబ్యున‌ల్ స్టే ఇచ్చింది. ఈ ప్రాజెక్టుకు వ్య‌తిరేకంగా రైతులు పోరాటం చేస్తున్నారు. మాకు ప‌రిహారం చెల్లించాల‌ని క‌దం తొక్కుతున్నారు అని కేటీఆర్ తెలిపారు.

కేసీఆర్ నాయ‌క‌త్వంలో ప‌దేండ్ల‌లో ఉమ్మ‌డి పాల‌మూరు జిల్లాలోని పెండింగ్‌ ప్రాజెక్టుల‌ను పూర్తి చేసి 8 ల‌క్ష‌ల ఎక‌రాల‌కు నీళ్లు ఇవ్వ‌డ‌మే కాకుండా పాల‌మూరును స‌స్య‌శ్యామ‌లం చేయ‌డ‌మే కాకుండా, కోన‌సీమ జిల్లాగా మార్చాల‌ని పాల‌మూరు ఎత్తిపోత‌లో 90 శాతం ప‌నులు పూర్తి చేశారు ఇది కేసీఆర్ ఘ‌న‌త‌. 22 నెల‌లుగా మిగిలిన‌ 10 శాతం ప‌నులు పూర్తి చేయ‌కుండా పాల‌మూరును ఎండ‌బెడుతున్న‌ది పాల‌మూరు బిడ్డ‌గా చెప్ప‌కునే రేవంత్ రెడ్డి. ఇంకా ఆశ్చ‌ర్యం ఏంటంటే అర‌పైసా ప‌ని చేయ‌కుండా.. పాల‌మూరు ఎత్తిపోత‌ల‌కు పిల్ల‌నిచ్చిన మామ జైపాల్ రెడ్డి పేరు పెట్టుకున్నారు. జైపాల్ రెడ్డి నీటిపారుద‌ల రంగానికి ఏం చేశారో జిల్లా వాసుల‌కు తెలుసు. ఒక్క రూపాయి కేటాయించ‌కుండా ఆ ప్రాక్టును పూర్తి చేయ‌కుండా ప‌డావుబెట్టి.. రైతుల నోట్లో మ‌ట్టి కొడుతున్న‌ది రేవంత్ రెడ్డినే అని కేటీఆర్ నిప్పులు చెరిగారు..

Kalvakuntla Tarakarama Rao – KTR