అఫ్గాన్‌ బోణీ…హాంకాంగ్‌పై ఘనవిజయం..!

ఆసియా కప్ టీ20 టోర్నీలో భాగంగా తొలి మ్యాచ్ మంగళవారం రాత్రి జరిగింది. అఫ్గానిస్తాన్ వర్సెస్ హాంకాంగ్ జట్ల మధ్య జరిగిన ఈ మ్యాచ్‌లో అఫ్గాన్ ఆటగాళ్లు బ్యాటింగ్, బౌలింగ్ విభాగంలో రాణించారు. దీంతో అఫ్గానిస్థాన్ జట్టు ఘన విజయంతో ఆసియా కప్ టోర్నీని మొదలు పెట్టింది…ఆసియా కప్ టోర్నీలో భాగంగా గ్రూప్ -బి తొలి మ్యాచ్‌లో అఫ్గాన్, హాంకాంగ్ జట్లు తలపడ్డాయి. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన అఫ్గాన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 188 పరుగులు చేసింది. ఆ జట్టు ఓపెనర్ సాదిఖుల్లా అటల్ ఆరు ఫోర్లు, మూడు సిక్సులతో 52 బంతుల్లో 73 (నాటౌట్) పరుగులు చేశాడు. అజ్మతుల్లా ఒమర్జాయ్ 21 బంతుల్లో 53 పరుగులు చేశాడు. ముఖ్యంగా అజ్మతుల్లా 20 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకొని అఫ్గాన్ తరపున ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీని నమోదు చేశాడు. హాంకాంగ్ బౌలర్లలో కించిత్ షా, ఆయుశ్ శుక్లా చెరో రెండు వికెట్లు పడగొట్టారు….

యూఏఈలో ఇటీవలే పాక్‌తో ముగిసిన ముక్కోణపు టీ20 సిరీస్‌ ఫైనల్‌లో బ్యాటింగ్‌ వైఫల్యంతో దారుణ పరాభవాన్ని మూటగట్టుకున్న ఆ జట్టు.. ఆసియా కప్‌ ఆరంభ మ్యాచ్‌లో మాత్రం రెచ్చిపోయింది. అబుదాబిలోని షేక్‌ జయేద్‌ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌ చేసిన రషీద్‌ ఖాన్‌ సేన నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 188 పరుగుల భారీ స్కోరు చేసింది. ఆ జట్టు ఓపెనర్‌ సెదికుల్లా అటల్‌ (52 బంతుల్లో 73 నాటౌట్‌, 6 ఫోర్లు, 3 సిక్స్‌లు), ఆల్‌రౌండర్‌ అజ్మతుల్లా (21 బంతుల్లో 53, 2 ఫోర్లు,5 సిక్స్‌లు) అర్ధ శతకాలతో కదం తొక్కారు. హాంకాంగ్‌ బౌలర్లలో కించిత్‌ షా (2/24) ఫర్వాలేదనిపించాడు. అనంతరం భారీ ఛేదనలో హాంకాంగ్‌.. 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 94 పరుగులే చేయగలిగింది. బాబర్‌ హయాత్‌ (43 బంతుల్లో 39, 3 సిక్స్‌లు) ఒక్కడే పోరాడాడు…

పోరాడకుండానే..!

ఛేదనలో హాంకాంగ్‌ బ్యాటర్లు పోరాడకుండానే చేతులెత్తేశారు. ఆరంభంలో ఆ జట్టు స్కోరుబోర్డుపై పరుగుల కంటే వికెట్లనే ఎక్కువగా కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. 4.3 ఓవర్లలో హాంకాంగ్‌.. 22 రన్స్‌కే 4 వికెట్లు నష్టపోయింది. జీషన్‌ అలీ (5), అన్షుమన్‌ (0), నిజకత్‌ (0), కల్హన్‌ (4), కించిత్‌ (6) అలా వచ్చి ఇలా వెళ్లారు. బాబర్‌ హయాత్‌ ఒక్కడే అఫ్గాన్‌ బౌలర్లను దీటుగా ఎదుర్కున్నాడు. కానీ 13వ ఓవర్లో గుల్బాదిన్‌ అతడి ఆట కట్టించాడు. అతడి తర్వాత కెప్టెన్‌ యాసిమ్‌ ముర్తాజా (16) ఆ జట్టులో రెండంకెల స్కోరు చేసిన బ్యాటర్‌గా నిలిచాడు. గుల్బాదిన్‌ (2/8), ఫజల్‌హక్‌ (2/16) తలా రెండు వికెట్లు పడగొట్టారు.

సంక్షిప్త స్కోర్లు
అఫ్గానిస్థాన్‌: 20 ఓవర్లలో 188/6 (సెదికుల్లా 73*, అజ్మతుల్లా 53, కించిత్‌ 2/24, ఆయుష్‌ 2/54);

హాంకాంగ్‌: 20 ఓవర్లలో 94/9 (బాబర్‌ 39, యాసిమ్‌ 16, గుల్బాదిన్‌ 2/8, ఫరూఖీ 2/16