నేపాల్ లో ఉన్న భారతీయుల కొరకు భారత రాయబార కార్యాలయం (ఖాట్మండు), రాష్ట్ర ప్రభుత్వాల హెల్ప్ లైన్ నెంబర్లు.;

నేపాల్ లో ఉన్న భారతీయుల కొరకు భారత రాయబార కార్యాలయం (ఖాట్మండు), రాష్ట్ర ప్రభుత్వాల హెల్ప్ లైన్ నెంబర్లు..

భారత విదేశాంగ శాఖ అధికారిక ప్రకటనలో నేపాల్‌లోని పరిస్థితిని గమనిస్తున్నామని తెలిపింది. ఈ క్రమంలో అక్కడ ఉన్న భారతీయులు అప్రమత్తంగా ఉండాలని, ప్రభుత్వ సూచనలు, నిబంధనలను పాటించాలని తెలిపింది. ఇలాంటి సమయంలో ప్రతి ఒక్కరు సహనంతో వ్యవహరించి, సమస్యలను శాంతియుతంగా, చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని ఆశిస్తున్నామని వెల్లడించింది.

జాగ్రత్తలు తీసుకోవాలి

దీంతోపాటు మరణించిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నట్లు వెల్లడించింది. అత్యవసర ప్రయాణాలు తప్పించి, నిరసనలు జరిగే ప్రాంతాలకు దూరంగా ఉండాలని కోరింది. శాంతియుత వాతావరణం తిరిగి నెలకొనేంతవరకూ జాగ్రత్తలు తీసుకోవాలని విదేశాంగశాఖ కోరింది. నేపాల్‌లో ఉన్న భారతీయ పౌరుల భద్రతే ప్రధానం అన్న నమ్మకంతో ఈ అడ్వైజరీని జారీ చేసింది…

నేపాల్ లో ప్రస్తుత పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, నేపాల్ లో ఉన్న భారతీయుల సహాయార్థం భారత రాయబార కార్యాలయం (ఖాట్మండు): +977 – 980 860 2881 / +977 – 981 032 6134 ఈ నెంబర్లకు సాధారణ కాల్స్ తో పాటు వాట్సాప్ లో కూడా సంప్రదించవచ్చని తెలిపారు._

ఆంధ్రప్రదేశ్ కి చెందిన వారు నేపాల్ లో చిక్కుకుపోయి ఏదైనా అత్యవసర సహాయం లేదా ఇబ్బందులు ఎదుర్కొంటుంటే, ఢిల్లీలోని ఏపీ భవన్ : +91 9818395787 మరియు APNRTS 24/7 హెల్ప్ లైన్ నంబర్లు: 0863 2340678, వాట్సాప్: +91 8500027678, ఇమెయిల్: helpline@apnrts.com మరియు info@apnrts.com లనైనా సంప్రదించగలరు._..