మహారాష్ట్ర గవర్నర్ పదవికి రాజీనామా చేసిన సీపీ రాధాకృష్ణన్
రేపు ఉపరాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేయనున్న సీపీ రాధాకృష్ణన్
గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవవ్రత్ కు మహారాష్ట్ర గవర్నర్ విధులను అప్పగించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము….సీపీ రాధాకృష్ణన్ దేశ తదుపరి ఉపరాష్ట్రపతిగా ఎన్నిక కావడంతో ఆయన గవర్నర్ పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు రాధాకృష్ణన్ రాజీనామాకు రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. రాధాకృష్ణన్ స్థానంలో మహారాష్ట్ర గవర్నర్ గా గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవవ్రత్ కు అదనపు బాధ్యతలు అప్పగించారు రాష్ట్రపతి.
ఈ మేరకు గురువారం (సెప్టెంబర్ 11) రాష్ట్రపతి కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. భారత ఉపరాష్ట్రపతిగా ఎన్నిక కావడంతో సీపీ రాధాకృష్ణన్ మహారాష్ట్ర గవర్నర్ పదవికి రాజీనామా చేశారని తెలిపారు. మహారాష్ట్ర గవర్నర్ బాధ్యతలను గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవవ్రత్కు అదనంగా అప్పగించినట్లు వెల్లడించారు.
జగదీప్ ధన్ఖడ్ రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక అనివార్యమైన సంగతి తెలిసిందే. 2025, సెప్టెంబర్ 9న ఉప రాష్ట్రపతి ఎన్నిక జరగగా.. ఎన్డీఏ కూటమి నుంచి సీపీ రాధాకృష్ణన్, ఇండీ కూటమి తరుఫున సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్ రెడ్డి పోటీ చేశారు. ఈ ఎన్నికలో ఇండియా కూటమి అభ్యర్థి జస్టిస్ బి.సుదర్శన్ రెడ్డిపై 152 ఓట్ల తేడాతో సీపీ.రాధాకృష్ణన్ విజయం సాధించారు