స్థానిక సంస్థల ఎన్నికల లోపే మహిళలకు నెలకు రూ.2500..!

ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు తెలంగాణ రాష్ట్రంలోని మహిళలకు ఆర్థికసాయాన్ని అందించే దిశగా రేవంత్ సర్కార్ దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు మహిళలకు నెలకు రూ.2,500 చొప్పున ఏడాదికి రూ.30,000 వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయనుంది. మహాలక్ష్మి పథకంలో భాగంగా 55 ఏళ్ల లోపు,పింఛను పొందని తెల్ల రేషన్ కార్డు కలిగిన మహిళలను లబ్ధిదారులుగా ఎంపిక చేయనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే ఈ పథకాన్ని ప్రారంభించనున్నట్లు సమాచారం…