కవిత ఇంటికి బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ సతీమణి శోభ హాజరు అయ్యారు. బుధవారం రాత్రి ఆమె అల్లుడు, కవిత భర్త అనిల్ పుట్టిన రోజు వేడుకలకు హాజరయ్యారు..ఈ సందర్భంగా శోభ తన కూతురు కవితకు కీలకమైన సూచనలు చేసినట్లుగా తెలుస్తోంది. కొద్ది రోజులు నిదానంగా ఉండాలని, అన్నీ సర్దుకుంటాయని కవితకు తల్లి భరోసా ఇచ్చినట్లుగా బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. కల్వకుంట్ల కుటుంబంలో తీవ్ర విభేదాల వేళ కవిత ఇంటికి కేసీఆర్ భార్య శోభ వెళ్లడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
కవిత ఆహ్వానించినా
కవిత కుమారుడి పుట్టిన రోజు వేడుకులకు కూడా శోభ వెళ్లలేదు. సాధారణంగా కవిత కుమారుడి పుట్టినరోజున కవిత ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటారు. ఈ కార్యక్రమానికి శోభతో పాటు కుటుంబసభ్యులంతా హాజరవుతారు. అయితే ఈ ఏడాది మాత్రం కుటుంబంలో జరిగిన పరిణామాల నేఫథ్యంలో అలా జరగలేదు. తన కుమారుడి బర్త్డే కార్యక్రమానికి రావాలని కవిత ఆహ్వానించినా ఆమె తల్లి రాలేదు. అయితే, కొత్త బట్టలు, పూజా సామగ్రి పంపించారని సమాచారం.