తెలంగాణలోని నిరుద్యోగులకు శుభవార్త..ఆర్టీసీలో 1,743 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.

*ఆర్టీసీలో 1,743 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్*

*తెలంగాణలోని నిరుద్యోగులకు శుభవార్త*

TGSRTCలో 1,743 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. 1,000 డ్రైవర్, 743 శ్రామిక్ (మెకానిక్, ఫిట్టర్, షీట్ మెటల్, ఆటో ఎలక్ట్రిషియన్, పెయింటర్, వెల్డర్, అప్ హోల్స్టర్, మిల్రెట్ మెకానిక్) పోస్టులకు *అక్టోబర్ 8 నుంచి 28 వరకు* దరఖాస్తులు స్వీకరించనున్నట్లు సంస్థ ప్రకటించింది..
R9TELUGUNEWS.COM
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎ్‌సఆర్టీసీ)లో ఉద్యోగాల భర్తీకి తొలి ప్రకటన వెలువడింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఇప్పటి వరకు ఆర్టీసీ నుంచి ఒక్క నోటిఫికేషన్‌ కూడా ఇవ్వలేదు. ఆర్టీసీలో 3080 పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఏడాది కిందట అనుమతి ఇవ్వగా.. అధికారులు తాజాగా నోటిఫికేషన్‌ జారీ చేశారు. అయితే ఉమ్మడి రాష్ట్రంలో మాదిరిగా ఆర్టీసీ నియామక విభాగం ద్వారా కాకుండా ఈ సారి రాష్ట్ర పోలీస్‌ నియామక బోర్డు ద్వారా ఖాళీలను భర్తీ చేయనున్నారు. టీజీఆర్టీసీలో డ్రైవర్లు, శ్రామిక్‌ పోస్టుల భర్తీకి పోలీసు రిక్రూట్‌మెంట్‌ బోర్డు చైర్మన్‌ వీవీ శ్రీనివాసరావు బుధవారం నోటిఫికేషన్‌ విడుదల చేశారు. మొత్తం 1743 పోస్టులు భర్తీ చేయనున్నట్లు ప్రకటించారు. ఇందులో డ్రైవర్‌ 1000, శ్రామిక్‌ 743 పోస్టులు ఉన్నాయి. అక్టోబరు 8 నుంచి పోలీసు రిక్రూట్‌మెంట్‌ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసేందుకు అక్టోబరు 28 సాయంత్రం 5 గంటల వరకు అవకాశం ఉంటుందని శ్రీనివాసరావు తెలిపారు. విద్యార్హత, ఇతర వివరాల కోసం డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.టీజీపీఆర్‌బీ.ఇన్‌ వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు. డ్రైవర్లకు పే స్కేల్‌ రూ.20,960-60,080; శ్రామిక్‌లకు రూ.16,550-45,030 వరకు ఉంటుందని వెల్లడించారు..