పల్లెబాట పడుతున్న నగరవాసులు ..!

దసరా పండుగ రావడంతో అప్పుడే నగరవాసులు సొంతూళ్ల బాట పట్టారు. సోమవారం నుంచి దసరా సెలవులు ఆరంభమవుతుందటం, ఆదివారం ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు ఉండటంతో శనివారం సాయంత్రమే నగరంలోని ప్రజలు పల్లెబాట పట్టారు. దీంతో హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారి (65వ నంబర్)లో వాహనాల రద్దీ పెరిగింది. శనివారం పాఠశాలల సమయం ముగిసిన అనంతరం విజయవాడ వైపు వాహనదారులు బారులు తీరి వెళ్లడం కనిపించింది.

పల్లెబాట పడుతున్న నగరవాసులు ..పట్నవాసులంతా ఒక్కసారిగా పల్లెబాట పట్టడంతో నగరంలోని ప్రధాన రహదారులన్నీ వాహనాలతో కిక్కిరిసిపోయాయి. ముఖ్యంగా హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై వాహనాలు రద్దీ భారీగా నెలకొంది. హైదరాబాద్లోని మహాత్మాగాంధీ బస్ స్టేటన్, జూబ్లీ బస్ స్టేషన్తో పాటు దిల్సుఖ్ నగర్, ఎల్బీనగర్, ఉప్పల్, ఆరాంఘర్ చౌరస్తాలలో రద్దీ భారీగా ఉంది. దసరా రద్దీని తట్టుకునేలా ఇవాళ్టి నుంచి ఆర్టీసీ స్పెషల్ బస్సులు ప్రారంభించింది. మొత్తం 7,754 ప్రత్యేక బస్సులను నడుపుతోంది. ఈ బస్సుల్లో 50 శాతం అదనపు ఛార్జీ ఉంటుంది…
సికింద్రాబాద్ జూబ్లీ బస్ స్టేషన్ స్వగ్రామాలకు వెళ్లే వారితో కిటకిటలాడుతోంది. చిన్నారులు, విద్యార్థులు వారి తల్లిదండ్రులతో కలిసి ఊర్లకు పయనమయ్యారు. ఉత్తర తెలంగాణలోని నిజామాబాద్ కామారెడ్డి సిద్దిపేట సిరిసిల్ల కరీంనగర్ ప్రాంతాలకు వెళ్లే ప్రజలు పెద్ద ఎత్తున జూబ్లీ బస్ స్టేషన్కు చేరుకుంటున్నారు. దసరా పండుగ పురస్కరించుకుని తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్టు ఆర్టీసీ అధికారులు తెలిపారు. ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.