గాజులరామారం ఆక్రమణలను తొలగిస్తున్న హైడ్రా…!

గాజులరామారం సర్వే నంబర్‌ 397లో ఆక్రమణలను హైడ్రా సిబ్బంది తొగిస్తున్నారు. నివాసాల జోలికి వెళ్లకుండా ఆక్రమణలను కూల్చివేస్తున్నారు. రాష్ట్ర ఫైనాన్స్‌ కార్పొరేషన్‌కు కేటాయించిన భూమిలో సుమారు 300 ఎకరాలను కబ్జాదారులు ఆక్రమించారని, 60 నుంచి 70 గజాల్లో ప్లాట్లుగా చేసి రూ.10 లక్షల చొప్పున అమ్ముతున్నారని హైడ్రాకు ఫిర్యాదు అందింది.

దీంతో రంగంలోకి దిగిన హైడ్రా అధికారులు, మేడ్చల్‌ జిల్లా కలెక్టర్‌ శనివారం పర్యటించారు. ఆక్రమణదారుల చేతుల్లో రూ.15 వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములు ఉన్నట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో ఆదివారం భారీ బందోబస్తు మధ్య కూల్చివేతలు చేపట్టారు. స్థానికులు కూల్చివేతలను అడ్డుకుంటున్నారు. దీంతో పోలీసులు, హైడ్రా సిబ్బంది వారిని అడ్డుకుంటున్నారు. ఆందోళనల నడుమే కూల్చివేతలు కొనసాగుతున్నాయి..

కబ్జాలు నిర్ధారించుకుని ఆదివారం ఉదయం నుంచి తొలగింపు పనులు చేపట్టింది. నివాసాల జోలికి వెళ్లకుండా ఆక్రమణలను మాత్రమే తొలగిస్తామని హైడ్రా చెబుతోంది. రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ కు కేటాయించిన భూమిలో బడా బాబుల ఆక్రమణలకు పాల్పడ్డారు. ఎకరాల్లో వెంచర్లు వేసి ప్లాట్లుగా విక్రయాలు చేసినవారిపై చర్యలు తీసుకుంటున్నట్లు హైడ్రా తెలిపింది. పేదవారిని ముందు పెట్టి.. బడాబాబులు వేయించిన షెడ్డుల తొలగించారు…