ప్రధాన వార్తలు..

మీ పార్టీ మాజీ నాయకుల విగ్రహాల కోసం ప్రజల సొమ్ము వాడొద్దు: సుప్రీంకోర్టు

తమిళనాడులోని డీఎంకే ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో చుక్కెదురు

కరుణానిధి విగ్రహం ఏర్పాటు ప్రతిపాదనను తిరస్కరించిన న్యాయస్థానం

నేతల కీర్తి కోసం ప్రజాధనం వాడొద్దని ప్రభుత్వానికి స్పష్టం

తమిళనాడులో అధికారంలో ఉన్న డీఎంకే ప్రభుత్వానికి అత్యున్నత న్యాయస్థానంలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మాజీ నేతల విగ్రహాల ఏర్పాటు కోసం ప్రజాధనాన్ని వినియోగించడాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. “మీ మాజీ నాయకుల గొప్పతనాన్ని చాటుకోవడం కోసం ప్రజల సొమ్మును ఎలా ఖర్చు చేస్తారు? దీనికి మేం అనుమతి ఇవ్వలేం” అని జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది.

వివరాల్లోకి వెళితే, తమిళనాడులోని తిరునెల్వేలి జిల్లా వల్లియూర్ కూరగాయల మార్కెట్ ప్రవేశ ద్వారం వద్ద దివంగత ముఖ్యమంత్రి కరుణానిధి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని డీఎంకే ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం సుమారు రూ. 30 లక్షల వరకు ఖర్చు చేసి, కొన్ని నెలల క్రితమే పనులు కూడా ప్రారంభించింది. అయితే, ప్రభుత్వ స్థలంలో విగ్రహ ఏర్పాటును వ్యతిరేకిస్తూ కొందరు మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు.

ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు, ప్రజా ప్రదేశాల్లో విగ్రహాల ఏర్పాటుకు అనుమతులు ఇవ్వకూడదని స్పష్టం చేసింది. కొన్నిసార్లు ఈ విగ్రహాల వల్ల ట్రాఫిక్ సమస్యలు కూడా తలెత్తుతున్నాయని పేర్కొంటూ, విగ్రహ నిర్మాణ పనులను వెంటనే నిలిపివేయాలని ఆదేశించింది. హైకోర్టు ఇచ్చిన ఈ తీర్పును సవాలు చేస్తూ తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది.

ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం, ప్రభుత్వ వైఖరిపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. మద్రాస్ హైకోర్టు తీర్పు సరైనదేనని సమర్థించింది. ప్రజాధనాన్ని ఇలాంటి పనుల కోసం దుర్వినియోగం చేయడాన్ని అనుమతించబోమని స్పష్టం చేసింది. వెంటనే పిటిషన్‌ను వెనక్కి తీసుకోవాలని, ఒకవేళ ఊరట కావాలనుకుంటే హైకోర్టునే ఆశ్రయించాలని ప్రభుత్వానికి సూచించింది..

యూరియా కోసం క్యూలో నిలబడ్డ రైతులపై దాడి చేసిన పోలీస్ కానిస్టేబుల్..

నల్లగొండ జిల్లా పెద్దవూరలో క్యూలో నిలబడ్డ ముగ్గురు రైతులను కొట్టి‌న కానిస్టేబుల్ దుశ్యా నాయక్…

*కుప్పకూలిన భవనం.. 13 మంది సజీవ సమాధి!*

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో సోమవారం రాత్రి తీవ్ర విషాదం చోటు చేసుకుంది.

జవహర్ మార్గ్‌లో ఐదంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలింది.

ఈ దుర్ఘటనలో 13 మంది సజీవ సమాధి అయినట్లు తెలుస్తోంది.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.

14 మందిని రక్షించారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు.

సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని పోలీసులు అనుమానిస్తున్నారు.

*మేడారంలో ఎత్తు బంగారం సమర్పించిన సీఎం రేవంత్ రెడ్డి*

మేడారం పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి వన దేవతలైన సమ్మక్క, సారలమ్మ తల్లులకు తన ఎత్తు బంగారం (బెల్లం) సమర్పించారు. మేడారం అమ్మవార్ల మొక్కుల్లో భక్తులు బెల్లాన్ని బంగారంగా అభివర్ణిస్తారు…
అసలైన అభివృద్ధి అంటే గిరిజనుల జీవనస్థితి మెరుగుపరచడమేనని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. గిరిజనులకు అదనంగా 22 వేల ఇందిరమ్మ ఇళ్లను కేటాయించామని అని తెలిపారు. దశాబ్దాలపాటు గిరిజనులకు అన్యాయం జరిగిందని, తాము సరిదిద్దాలని భావించామని ఆయన పేర్కొన్నారు. అందుకే ప్రభుత్వం, పాలనలో గిరిజన బిడ్డలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నట్లు వెల్లడించారు.

సమ్మక్క-సారలమ్మ గద్దెల పునఃనిర్మాణం అవకాశం దక్కడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. నిధుల కోసం గతంలో సీతక్క ఇచ్చిన వినతిపత్రాలను అప్పటి ప్రభుత్వం పట్టించుకోలేదని, ఇప్పుడు సీతక్క నిధులు ఇవ్వటం కాదు ఆ దస్త్రాలపై ఆమె సంతకం పెడుతోందని వెల్లడించారు. గతంలో అభివృద్ధి గురించి నేతలను అడగటమే గగనమైన పరిస్థితి ఉండేదని, నిధులు అడిగితే ఏదో భిక్షం ఇస్తున్నట్లు వ్యవహరించేవారని ఆవేదన వ్యక్తం చేశారు. అభివృద్ధి అంటే అద్దాల మేడలు, గోడలు మాత్రమే కాదన్న సీఎం రాతి కట్టడాలు కూడా వందల ఏళ్లు నిలబడి ఉంటాయని అన్నారు..

బాపట్ల : సూర్యలంకలో జరగాల్సిన బీచ్‌ ఫెస్టివల్‌ వాయిదా.

భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో బీచ్‌ ఫెస్టివల్‌ వాయిదా.

తొలుత ఈ నెల 26 నుంచి 28 వరకు బీచ్‌ ఫెస్టివల్‌ నిర్వహించాలని నిర్ణయం..

*నేడు, రేపు లోక్‍సభ సబార్డినేట్ లేజిస్లేషన్ కమిటీ సమావేశాలు.*

సమావేశాలకు హాజరుకానున్న వివిధ రాష్ట్రాలకు చెందిన 12 మంది ఎంపీలు.

మొదటిరోజు విద్యుత్ రంగ సంస్థలు ఎన్టీపీసీ, ఆర్ఈసీ, పీఎఫ్‍సీ సీఎండీలతో పలు అంశాలపై చర్చ..

మొదటిరోజు వివిధ బ్యాంక్‍ల ఛైర్మన్‍లు, ఎండీలతో పలు అంశాలపై చర్చ…

సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝాపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం

కలెక్టర్‌కు డ్రెస్సింగ్ సెన్స్ లేదు.. ఆయనను చూస్తే మాకే భయంగా ఉంది. ప్రజలకు ఎలా సేవ చేస్తారని హైకోర్టు తీవ్ర ఆగ్రహం

కలెక్టర్ సందీప్ కుమార్ ఝాపై చర్యలు తీసుకోవాలని ప్రిన్సిపల్ హోమ్ సెక్రటరీకి ఆదేశం

మిడ్ మానేరు నిర్వాసితురాలు వనబట్ల కవితకు నష్ట పరిహారం చెల్లించాలని గతంలో ఆదేశాలు జారీ చేసిన హైకోర్టు

హైకోర్టు ఆదేశించినా నష్టపరిహారం చెల్లించకపోవడంతో పాటు.. ఆర్డీవో, ఎమ్మార్వోలకు చెప్పి కవితపై అక్రమ కేసులు నమోదు చేయించిన కలెక్టర్

దీంతో మరోసారి హైకోర్టును ఆశ్రయించిన బాధితురాలు కవిత

గతంలో ఇదే పిటిషన్‌పై కోర్టుకు హాజరైనప్పుడు సందీప్ కుమార్ ఝా డ్రెస్సింగ్ సెన్స్‌పై హైకోర్టు తీవ్ర అభ్యంతరం

కోర్టు ప్రొసీడింగ్స్ తెలియదా.. కోర్టుకు వచ్చే పద్ధతి ఇదేనా అంటూ కలెక్టర్‌పై మండిపడ్డ హైకోర్టు..

కలెక్టర్‌పై చర్యలకు ఆదేశించి, గతంలో బాధితురాలికి ఇచ్చిన నష్టపరిహారం తీర్పు యధావిధిగా అమలు చేయాలని ప్రభుత్వానికి, సీఎస్‌ను ఆదేశించిన హైకోర్టు..

బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం.

బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం
తెలంగాణలో 21 జిల్లాలకు భారీ వర్ష సూచన
పలుచోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం
40 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం..

మల్లోజులను ద్రోహిగా ప్రకటించిన మావోయిస్ట్ కేంద్ర కమిటీ.

మావోయిస్ట్ నేత మల్లోజుల వేణుగోపాల్‌పై మావోయిస్టు కేంద్ర కమిటీ చర్యలు చేపట్టింది. మల్లోజులను ద్రోహిగా ప్రకటించింది కేంద్ర కమిటీ. ఆయుధ పోరాటానికి ముగింపు పలుకుతామంటూ మావోయిస్టు అధికార ప్రతినిధి హోదాలో మల్లోజుల వేణుగోపాల్‌ అలియాస్‌ భూపతి అలియాస్‌ అభయ్‌ పేరుతో గతవారం ఒక లేఖ విడుదలైంది. ఈ లేఖ సంచలనం సృష్టించింది. తుపాకులు విడిచిపెట్టి, తాము చర్చలకు సిద్ధంగా ఉన్నామని నాటి లేఖలో మల్లోజుల ప్రకటించారు. అయితే అభయ్‌ రాసిన లేఖ వ్యక్తిగతమంటూ తెలంగాణ శాఖ ఈ లేఖ విడుదల చేసింది. అధికార ప్రతినిధి జగన్‌ పేరుతో తెలుగులో లేఖ బయటకు వచ్చింది. సరిగ్గా ఆలోచించే వాళ్లు అలాంటి లేఖ రాయరని జగన్‌ స్పష్టం చేశారు. ఈ పరిస్థితుల్లో మల్లోజులను ద్రోహిగా ప్రకటించింది మావోయిస్టు కేంద్రకమిటీ.

అమ్మవారి దీక్షా దుస్తుల్లో అసెంబ్లీకి మహిళా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.

నవరాత్రులు సందర్భంగా రోజూ అమ్మవారికి ధరించే రంగు దుస్తుల్లోనే అసెంబ్లీకి వెళ్లాలని మహిళా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిర్ణయించారు. ఇందులో భాగంగా మంగళవాం (సెప్టెంబర్ 23) గాయత్రిదేవి అలంకారం సందర్భంగా ఎర్ర దుస్తులు ధరించిన మహిళా సభ్యులు అసెంబ్లీకి వచ్చారు. రాష్ట్రాన్ని చల్లగా చూడాలని దుర్గమ్మను వేడుకున్నామని తెలిపారు. మన సంస్కృతి, సంప్రదాయాలపై సందేశం ఇవ్వాలని డ్రెస్‌కోడ్‌ పాటిస్తున్నామని ప్రజా ప్రతినిధులు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా దుర్గా నవరాత్రులు ఎంతో వైభవంగా జరుగుతున్నాయి. భక్తులకు లోటు లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని హోంమంత్రి అనిత వెల్లడించారు.