ఏపీ సీఎం చంద్రబాబు కు లీగల్ నోటీసులు..!

మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి, హత్య జరిగినప్పుడు పులివెందుల సిఐ గా ఉన్న జె,శంకరయ్య ఏకంగా సీఎం చంద్రబాబుకే లీగల్ నోటీసులు పంపించారు. వివేక హత్య కేసులో తన వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించే లా ఉద్దేశపూర్వకంగా చంద్రబాబు,పలుమార్లు తప్పుడు ప్రకటనలు చేశారని ఆరోపిస్తూ న్యాయవాది ద్వారా ఈ నోటీసులు పంపారు.

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు,రూ. 1.45 కోట్లు చెల్లించాల‌ని నోటీసుల్లో పేర్కొన్నారు. వివేకా హ‌త్య కేసులో త‌న ప్రతిష్టకు బాబు భంగం క‌లిగించార‌ని ఆరోప‌ణ‌లు చేశారు. అసెం బ్లీలో సిఎం చంద్ర‌బాబు బ‌హిరంగ క్ష‌మాప‌ణ చెప్పాల‌ని నోటీసులో వివరించారు.

వివేకా హ‌త్య జ‌రిగిన‌ ప్పుడు 2019లో పులివెందుల సిఐగా శంక‌ర‌య్య ఉన్నారు. ప్ర‌స్తుతం క‌ర్నూలు రేంజ్‌లో శంక‌ర‌య్య వీఆర్‌లో ఉన్నారు. సిఐ శంకరయ్య సమక్షంలోనే నిందితులు హత్యకు సంబంధించిన ఆధారాలు ధ్వంసం చేశారని గతంలో చంద్ర బాబు దురుద్దేశపూర్వకంగా ఆరోపణలు చేశారని ఆయన ఆరోపించారు.