సూర్యాపేట జిల్లా….
పాలకీడు మండలం డెక్కన్ సిమెంట్ వద్ద ఇటీవల జరిగిన పోలీసులపై దాడికి సంబంధించి యూపీ, బీహార్ 15 మంది పై కేసు నమోదు………
14 మంది అరెస్టు రిమాండ్ కి తరలింపు..
ఒక్కరు పరారి..
ci చరమంద రాజు తెలిపిన వివరాల ప్రకారం..
శాంతి భధ్రతలకు విఘాతం కలిగిస్తే ఎంతటి వారినైనా విడిచిపెట్టేది లేదు అన్నారు..
తేదీ 21.05.2025 నాడు డెక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీ లో Hajee A.P Bava & Co అను Company ద్వారా పనిచేస్తున్న ఉత్తరప్రదేశ్ వాసి అయిన వినోద్ అనే వ్యక్తి గుండెపోటుతో వలన చనిపోవడంతో. అతడి మృతికి రూపాయలు 20 లక్షలు నష్టపరిహారం చెల్లించాలని ఉత్తరప్రదేశ్, భీహార్ రాష్ట్రాలకు చెందిన కార్మికులు తేదీ.22.09.2025 నాడు ఉదయం 10:30 గంటల సమయంలో డెక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీ మెయిన్ గేట్ ముందు ధర్నా నిర్వహించి ఎవరిని లోనికి వెళ్లకుండా, ఎటువంటి వెహికల్స్, బయటకి పోనివ్వకుండా 20 లక్షలు రూపాయలు డిమాండ్ చేస్తూ ధర్నా చేస్తుండగా డెక్కన్ సిమెంట్ యాజమాన్యం ఇచ్చిన సమాచారం మేరకు స్థానిక పాలకీడు SI తన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకొని ఏదైనా సమస్య ఉన్న డెక్కన్ సిమెంట్ యాజమాన్యం వారితో మాట్లాడి సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోమని చెప్పి ధర్నా చేస్తున్న వారితో మాట్లాడుతున్న సమయంలో అందులో
1. ముఖేష్ ప్రసాద్ (ఉత్తరప్రదేశ్) (Hajee A.P Bava & Co company)
2.మంజీత్ కుమార్(ఉత్తరప్రదేశ్) (Paharpur Cooling towers Ltd company),
3.మన్సూర్ అలం(ఉత్తరప్రదేశ్), (Paharpur Cooling towers Ltd company),
4.శక్తి చౌహన్ (ఉత్తరప్రదేశ్) (SLE(Sri Laxmi Electricals company), 5.రవి శంకర్ సహాని (ఉత్తరప్రదేశ్)
6.కిసాన్ సహాని(ఉత్తరప్రదేశ్)(Hajee A.P Bava & Co company),
7. ధనంజయ్(ఉత్తరప్రదేశ్) (Hajee A.P Bava & Co company),
8. కమలేష్ యాదవ్(ఉత్తరప్రదేశ్) (Hajee A.P Bava & Co company),
9.ఉమేష్ కుమార్ యాదవ్(ఉత్తరప్రదేశ్) (Hajee A.P Bava & Co company), 10.భాను పౌల్దార్(భీహార్) (SLE(Sri Laxmi Electricals company),
11.విక్రమ్ కుమార్(భీహార్) (Paharpur Cooling towers Ltd company), 12.అభిషేక్ కుమార్(భీహార్) (Hajee A.P Bava & Co company),
13.రాహుల్ కుమార్(భీహార్) (Hajee A.P Bava & Co company),
14.మన్సూర్ అన్సారీ,(ఉత్తరప్రదేశ్) (Hajee A.P Bava & Co company),
15.సచిన్ విశ్వకర్మ(ఉత్తరప్రదేశ్), (Hajee A.P Bava & Co company), ఇంకా కొంతమంది వ్యక్తులు ఒక గ్రూపుగా ఏర్పడి కర్రలు రాళ్లు తో ఒక్కసారిగా పోలీసు వారిపై దాడి చేసి అయిన తమ డిమాండ్లను నెరవేర్చుకోవాలని ఉద్ధేశ్యంతో ఆకస్మాత్తుగా పాలకీడు SI తోపాటు తన సిబ్బంది పై రాళ్లతో దాడి చేయగా అట్టి దాడిలో SI కి మరియు మరొక హోంగార్డు గోపికి గాయాలు కావడంతో వారిని ఆసుపత్రి తరలించడం జరిగింది.. కార్మికులు చేసిన దాడిలో పాలకీడు పోలీసువారి ప్రభుత్వ వాహనం అద్దాలు పూర్తిగా ధ్వంసం కావడం. ఈ విషయంలో పాలకవీడు SI ఇచ్చిన దరఖాస్తు పై కేసు నమోదు చేసి దర్యాప్తు పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నామని అన్నారు.. సిబ్బందిని మూడు గ్రూపులుగా ఏర్పాటు చేసి సీసీ కెమెరాలు రికార్డు అయినా వ్యక్తులను గుర్తించి తేదీ 23.09.2025 నాడు మధ్యహన సమయంలో విష్ణుపురం రైల్వే స్టేషన్ వద్ద A1 to A4 నేరస్థులను పట్టుబడి చేసి వారిని విచారించగా, వారు మిగతా A5 to A15 నేరస్థుల పేర్లు తెలపగావారిని డెక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీ లేబర్ కాలనీలో A5 ఒక్కడు పరారీలో ఉండగా మిగతా A6 to A15 నేరస్థులను లను పట్టుబడి చేసి వారి వద్ద నుండి గొడవకు ఉపయోగించిన కర్రలను స్వాదీనం చేసుకొని ఈ రోజు రిమాండ్ కు తరలించడం జరిగిందని పరారీలో ఉన్న A5 నేరేస్తుడుని కూడా త్వరలో పట్టుకుంటాము అని అన్నారు ..
సేకరణ .
షేక్. మహబూబ్ అలీ