హైదరాబాద్‌ మెట్రో మొదటి దశ ప్రాజెక్ట్, రాష్ట్ర ప్రభుత్వం చేతిలోకి..!

తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ మెట్రో ఫేజ్-1ను స్వాధీనం చేసుకోనుంది..

హైదరాబాద్‌ మెట్రో రైలు ప్రాజెక్టు లిమిటెడ్‌ (HMRL) నుంచి తప్పుకుంటూ ఎల్‌అండ్‌టీ (L&T) సంచలన నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు గురువారం ఓ ప్రకటనలో తన నిర్ణయాన్ని వెల్లడించింది…

మెట్రో మొదటి దశ ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వం కొనుగోలు చేయనుంది. ఎల్‌అండ్‌టీకి ఉన్న రూ.13 వేల కోట్ల అప్పును ప్రభుత్వం టేకోవర్‌ చేసేందుకు సంసిద్ధత తెలిపినట్టు సమాచారం. ఎల్‌అండ్‌టీకి రూ.2,100 కోట్లు డబ్బు చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధం అయింది. దీంతో హైదరాబాద్‌ మెట్రో రైలు నిర్వహణ నుంచి ఆ సంస్థ వైదొలగనుంది. హైదరాబాద్‌ మెట్రో 69 కి.మీ.మొదటిదశని ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో రూ.22 వేల కోట్లతో నిర్మించిన విషయం తెలిసిందే.

పలుదఫాలుగా చర్చించిన అనంతరం : హైదరాబాద్‌ మెట్రో రైలు విస్తరణను వీలైనంత త్వరగా చేపట్టాలన్న పట్టుదలతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఎల్‌అండ్‌టీతో పలుదఫాలుగా చర్చించారు. ఐదు రోజుల క్రితం చర్చించి జాప్యం చేయకుండా ఏదో ఒక నిర్ణయానికి రావాలని స్పష్టం చేసినట్లుగా తెలిసింది. ఒకానొక సమయంలో బ్యాంకుల్లో ఉన్న లోన్లు రూ.13 వేల కోట్లు, నిర్మాణానికి అయిన ఖర్చు రూ.7 వేల కోట్లను కలిపి ఇస్తే పూర్తిగా తప్పుకొంటామని ఎల్‌అండ్‌టీ ప్రతిపాదించగా, రుణాల బాధ్యత వరకు పూర్తిగా తీసుకొంటామని, భారత రాష్ట్ర సమితి హయాంలో వయబిలిటీ గ్యాప్‌ ఫండ్‌ కింద పెండింగ్‌లో పెట్టిన బకాయిల వరకు ఇస్తామని ప్రభుత్వం వైపు నుంచి చెప్పినట్లుగా సమాచారం. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం, ఎల్అండ్టీ మధ్య కుదిరిన ఒప్పందం ప్రాధాన్యం సంతరించుకుంది..

కేంద్ర ప్రభుత్వం సూచనలతో : రాష్ట్ర ప్రభుత్వం మెట్రో రెండోదశకు సంబంధించిన ప్రతిపాదనను కేంద్రానికి పంపిన విషయం తెలిసిందే. సగం ఒకరు నిర్వహిస్తుంటే, మిగిలిన సగం వేరే వారు నిర్మించి, ఎలా నిర్వహిస్తారు? విక్రయించిన ప్రతి టికెట్‌లో ఎవరి వాటా ఎంత తదితర ప్రశ్నలను కేంద్రం కొద్దిరోజుల క్రితం లేవనెత్తినట్లుగా తెలిసింది. వీటిపై రాష్ట్ర ప్రభుత్వం, ఎల్‌అండ్‌టీ సంస్థ కలిసి ఒక ఒప్పందం చేసుకొని రావాలని సూచించింది. దీంతో ఈ అంశాన్ని కొలిక్కి తెచ్చేందుకు ప్రభుత్వం కొన్ని రోజులుగా తన ప్రయత్నాలను ముమ్మరం చేసింది దాని ఫలితమే తాజా ఒప్పందం..మెట్రో మార్గాన్ని రాయదుర్గం నుంచి ఫైనాన్సియల్‌ డిస్ట్రిక్ట్, నాలెడ్జ్‌సిటీ మీదుగా నియోపోలిస్‌ వరకు మియాపూర్‌ నుంచి బీహెచ్‌ఈఎల్, రామచంద్రాపురం వరకు ఎల్‌.బి.నగర్‌ నుంచి హయత్‌నగర్‌ వరకు గౌలిగూడ నుంచి చాంద్రాయణగుట్ట వరకు,నాగోల్‌ నుంచి ఎల్‌.బి.నగర్, ఒవైసీ ఆసుపత్రి మీదుగా శంషాబాద్‌ వరకు ఇలా పూర్తిస్థాయిలో విస్తరిస్తేనే ప్రయోజనం ఉంటుందని తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వం ఆలోచిస్తోంది. ప్రస్తుతం ఉన్న మెట్రోరైలును పరిగణనలోకి తీసుకొంటే ప్రజలు చివరి పాయింట్లో దిగి ముఖ్యమైన ప్రాంతాలకు ఆటోలు, ఇతర వాహనాల్లో వెళ్లాల్సి వస్తోందని సెకండ్ ఫేజ్ పూర్తి చేస్తేనే పూర్తిస్థాయిలో ప్రయోజనం ఉంటుందని భావిస్తోంది..

LTMRHL యొక్క ₹13,000 కోట్ల రుణాన్ని ప్రభుత్వం స్వీకరించనుంది.

L&Tకి (ఒకసారి) ఈక్విటీ సెటిల్‌మెంట్‌గా ₹2,000 కోట్లు చెల్లించడం.

ఇది GoI ఫేజ్ 2 విస్తరణను ప్రాసెస్ చేయడానికి మార్గం సుగమం చేస్తుంది.

టేకోవర్ యొక్క షరతులు చట్టపరమైన/చట్టబద్ధమైన సమ్మతితో రూపొందించబడతాయి.

L&T ఫేజ్ 2లో ఈక్విటీ భాగస్వామిగా పాల్గొనడానికి నిరాకరించింది (వారు రవాణా రాయితీ ఆస్తుల యాజమాన్యం/నిర్వహణ నుండి నిష్క్రమించారు).

L&T ప్రారంభంలో GoTG LTMRHL యొక్క రుణాన్ని (~₹13,000 కోట్లు) స్వాధీనం చేసుకోవాలని + ~₹5,900 కోట్ల ఈక్విటీని చెల్లించాలని సూచించింది.

GoTG ఇప్పటికీ ₹2,100 కోట్లు (2022 రాయితీ ఒప్పందం ప్రకారం అంగీకరించిన ₹3,000 కోట్ల రుణం) చెల్లించాలని వారు గుర్తు చేశారు.