యువత మంచి మార్గంలో నడిచి, మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకోవాలి.. MP రఘువీర్ రెడ్డి..

*సూర్యాపేట జిల్లా* …

హుజుర్ నగర్ రామస్వామి గట్టు వద్ద గల అడ్వాన్సు టెక్నాలజీ సెంటర్ ను ప్రారంభించిన నల్గొండ ఎంపీ కుందూరు రఘు వీర్ రెడ్డి…..

*Mp రఘువీర్ రెడ్డి మాట్లాడుతూ..*

యువత మంచి మార్గంలో నడిచి, మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకోవాలి ఆశయంతో ప్రభుత్వ తరఫున ఎంత ఖర్చైనా కానీ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి తోపాటు అందరం కలిసి ఈ అత్యాధునిక టెక్నాలజీ సెంటర్ ని ప్రారంభించడం జరుగుతుందని అన్నారు…

యువత బంగారు భవిష్యత్తు బాగుండాలని,, అందరూ కూడా ఆసక్తితో ఇటువంటి టెక్నాలజీ సెంటర్లో చేరి వారి భవిష్యత్తుని మంచిగా మార్చుకోవాలని ఆశిస్తున్నట్లు,, ఆ భగవంతున్ని కూడా ప్రార్థిస్తున్నట్లు తెలిపారు..నేడు హుజూర్ నగర్ నియోజకవర్గంలో 65 (ITI) సెంట్రల్ ను, ATC సెంటర్లుగా అప్డేట్ చేస్తున్న దాంట్లో భాగంగా హుజూర్నగర్ నియోజకవర్గంలో నేడు ప్రారంభోత్సవం జరిగింది….

యువకులు అందరికీ కూడా దసరా పండగ ముందుగానే వచ్చినట్లుగా అనిపిస్తుంది…

ఐటిఐ సెంటర్లు కొత్త తరానికి తగినట్లుగా ఇంకా అభివృద్ధి చెందకపోవడంతో యువత కొంత ఇబ్బందులకు గురైందని అన్నారు…

నేడు అడ్వాన్స్ టెక్నాలజీతో TATA కంపెనీ సౌజన్యంతో తెలంగాణ ప్రభుత్వం సహాయ సహకారాలతో ATC అట్టహాసంగా ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు…

రానున్న రోజుల్లో యువత గొప్ప గొప్ప టెక్నాలజీని అంతా కూడా అందుబాటులోకి తెచ్చుకునే విధంగా ముందుకు సాగుతుందని ఆశిస్తున్నానని అన్నారు..

వీటివల్ల ఎంత లాభం అనేది రానున్న రోజుల్లో యువతకి అర్థమవుతుందని అన్నారు…

ఏ టి సి సెంటర్ ఏర్పాటు చేసినందుకు సీఎం రేవంత్ రెడ్డికి,, మంత్రి ఉత్తంకుమార్ రెడ్డికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు..

యువతకి స్వయం ఉపాధి కల్పించాలని కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఎంతగానో కృషి చేస్తుందని అన్నారు..

119 నియోజకవర్గాల్లో మెరుగైన విద్య అందించడం కోసం, అడ్వాన్స్ టెక్నాలజీ ఉన్న ఇంటిగ్రేటెడ్ స్కూల్ అని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు…

అడ్వాన్స్ టెక్నాలజీ నేర్చుకోవడం వల్ల పెద్ద పెద్ద కంపెనీల్లో మంచి ఉపాధి కూడా దొరుకుతుంది అన్నారు…

యువత, నిరుద్యోగుల్ని దృష్టిలో పెట్టుకొని ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడమే కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతుందని అన్నారు.