హైదరాబాద్:
*🔹మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్.*
అక్టోబర్ 5 నాటికి జెడ్పీటీసీ అభ్యర్థుల ప్రతిపాదనలు సిద్ధం చేయాలి.
ప్రతి జెడ్పీటీసీ స్థానం నుంచి ముగ్గురి పేర్లను ప్రతిపాదించాలి*.
అక్టోబర్ 5వ తేదీ లోపు టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ కు జాబితాను అందజేయాలని మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి సూచన..
*జెడ్పీటీసీ అభ్యర్థులకు సీఎం రేవంత్ దిశానిర్దేశం..*
*హైద్రాబాద్:* జెడ్పీటీసీ ఎన్నికల ఏర్పాట్లపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.అక్టోబర్ 5 నాటికి జెడ్పీటీసీ అభ్యర్థుల ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. ప్రతి జెడ్పీటీసీ స్థానం నుంచి ముగ్గురి పేర్లను ప్రతిపాదించాలని సూచించారు. అక్టోబర్ 5లోపు టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ కు అభ్యర్థుల జాబితాను అందజేయాలని సీఎం రేవంత్ రెడ్డి మంత్రులకు స్పష్టమైన సూచనలు ఇచ్చారు..
పెరిగిన సిలిండర్ ధరలు
పెరిగిన సిలిండర్ ధరలు
19 కిలోల వాణిజ్య LPG సిలిండర్ ధర రూ.15 పెరిగింది. అయితే, 14 కిలోల గృహ వినియోగ సిలిండర్ ధరలో ఎటువంటి మార్పు లేదు. దేశవ్యాప్తంగా వంట గ్యాస్ ధర రూ.850-రూ.960 వరకు ఉంది. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్లో రూ.905, వరంగల్లో రూ.924, విశాఖపట్నంలో రూ.861, విజయవాడలో రూ.875గా ఉంది. పండుగ సీజన్లో వాణిజ్య సిలిండర్ల ధరలు పెరిగినా, గృహ వినియోగదారులకు ఉపశమనం లభించింది. ప్రభుత్వం ఉజ్వల యోజన కింద కోట్లాది మంది మహిళలకు ఉచిత సిలిండర్లు, కొత్త కనెక్షన్లు అందిస్తోన్న విషయం తెలిసిందే..
ప్రముఖ నటి కమలాశ్రీ కన్నుమూత.
ప్రముఖ నటి కమలాశ్రీ కన్నుమూత
ప్రముఖ కన్నడ సీనియర్ నటి కమలాశ్రీ మంగళవారం అర్థరాత్రి కన్నుమూశారు. గత కొంతకాలంగా రొమ్ము క్యాన్సర్తో బాధపడుతున్న ఆమె బెంగళూరులోని కిద్వాయ్ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. ఆమె గతంలో టీబీ, బ్రెయిన్ ట్యూమర్తో పోరాడారు. కమలాశ్రీ గట్టి మేళ సీరియల్తో సహా అనేక సినిమాలు, నాటకాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో, ‘నాకు కూడా ఒక కుటుంబం, పిల్లలతో ఉండాలని ఉంది. కానీ నా గత జన్మ పాపాల కారణంగా ఆ ఆనందం లభించలేదు’ అని బాధ పడ్డారు…
మందుబాబులకు బిగ్ షాక్.. మరికొన్ని గంటల్లో వైన్స్ బంద్!
మందుబాబులకు బిగ్ షాక్.. మరికొన్ని గంటల్లో వైన్స్ బంద్!
తెలంగాణ : మందుబాబులకు బిగ్ షాక్ తగలనుంది. మరికొన్ని గంటల్లో తెలంగాణలో మందు షాపులు బంద్ కానున్నాయి. రేపు గాంధీ జయంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా మద్యం దుకాణాలు మూతపడనున్నాయి. ఈ సారి గాంధీ జయంతి, దసరా పండుగ రెండు ఒకే తేదీన రావడంతో పండుగ వాతావరణంపై ప్రభావం పడనుంది. కాగా ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు…
హైదరాబాద్లో గంజాయి మత్తులో రౌడీషీటర్ హల్చల్
పాతబస్తీ ఐ.ఎస్ సదన్ పీఎస్ పరిధిలోని నెహ్రూ నగర్లో కత్తితో రోడ్డుపై వెళ్లే వారిపై దాని చేసిన రౌడీషీటర్ నసీర్
కత్తితో పలు వాహనాలను ధ్వంసం చేసిన నసీర్
బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకొని నసీర్ కోసం గాలిస్తున్న పోలీసులు…
కారు బీభత్సం.. తప్పిన పెను ప్రమాదం
కరీంనగర్ మండలం అలుగునూర్లోని కాకతీయ బార్ వద్ద బుధవారం ఓ కారు బీభత్సం సృష్టించింది. కుక్కను తప్పించబోయిన కారు పక్కనే ఉన్న బారికేడ్లను ఢీకొట్టింది. ఈ ఘటనలో కారు ముందు భాగం దెబ్బతినగా డ్రైవర్కు పెను ప్రమాదం తప్పింది. అతివేగం వల్లే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. పగటిపూట ఇలాంటి ప్రమాదాలు తరచూ జరుగుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు…
మావోయిస్టులు ఆయుధాలు వదిలితే సహకరిస్తాం: డీజీపీ శివధర్ రెడ్డి
నూతన డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన శివధర్ రెడ్డి, మావోయిస్టులు స్వచ్ఛందంగా లొంగిపోవాలని, ఆయుధాలు వీడితే సహకరిస్తామని పిలుపునిచ్చారు. చైనా వంటి దేశాలతో పోలిస్తే మన దేశంలో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయని, మావోయిస్టులు ప్రజల్లోకి వచ్చి అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని ఆయన సూచించారు. ప్రజల రక్షణే ధ్యేయంగా పనిచేస్తామని, టెక్నాలజీని మరింత సమర్థవంతంగా వినియోగించుకుంటామని తెలిపారు. 17 వేల పోలీసు ఖాళీల భర్తీకి సీఎంకు ప్రతిపాదనలు పంపించామని వెల్లడించారు….
డ్రంకెన్ డ్రైవ్ చేసేవాళ్లు టెర్రరిస్టులు: సజ్జనార్
హైదరాబాద్ సీపీగా బాధ్యతలు తీసుకున్నాక సజ్జనార్ చేసిన కామెంట్స్ వైరలవుతున్నాయి.
‘డ్రంకెన్ డ్రైవ్ చేసేవాళ్లు టెర్రరిస్టులతో సమానం.
తాగిన మత్తులో వాహనం నడిపి ఎంతమందిని చంపుతారో, వాళ్లే చనిపోతారో తెలియదు.
అందుకే అలాంటి వాళ్లను వదిలే ప్రసక్తే లేదు’ అని సజ్జనార్ హెచ్చరించారు.
ఆయన సరిగ్గా మాట్లాడారని, డ్రంకెన్ డ్రైవ్ చేసేవాళ్లను వదలొద్దని నెటిజన్లు సపోర్ట్ చేస్తున్నారు..
5 నాటికి అభ్యర్థుల పేర్లు పంపండి: సీఎం
స్థానిక ఎన్నికల్లో జడ్పీటీసీ స్థానాలకు అభ్యర్థుల పేర్ల జాబితాలను ఈ నెల 5 నాటికి పీసీసీకి పంపాలని మంత్రులు, డీసీసీ అధ్యక్షులకు సీఎం రేవంత్రెడ్డి సూచించారు. అన్ని జిల్లాల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్యనాయకులతో సంప్రదించి ప్రతి జడ్పీటీసీ స్థానానికి ముగ్గురు బలమైన అభ్యర్థులను గుర్తించాలని స్పష్టంచేశారు. నిన్న జూమ్ ద్వారా సీఎం మాట్లాడారు. పీసీసీ అధ్యక్షుడు, ఏఐసీసీ ఇన్చార్జి మీనాక్షి, డిప్యూటీ సీఎం పాల్గొన్నారు..
మల్లికార్జున్ ఖర్గేకు అస్వస్థత
అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (AICC) అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అస్వస్థతకు గురై బెంగళూరులోని ఎంఎస్ రామయ్య ఆసుపత్రికి చేరారు. మంగళవారం రాత్రి నుంచి ఆయనకు నిరంతర జ్వరం రావడంతో చికిత్స అందిస్తున్నారు. 83 ఏళ్ల ఖర్గే ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు తెలిపారు. ఆయన త్వరగా కోలుకోవాలని కాంగ్రెస్ శ్రేణులు ఆకాంక్షిస్తున్నాయి..
టీవీకే అధ్యక్షుడు విజయ్ కీలక నిర్ణయం..
రాష్ట్ర వ్యాప్త పర్యటనలు వాయిదా వేసుకున్న విజయ్..పర్యటనలు రెండు వారాలు వాయిదా వేసిన టీవీకే..కరూర్ తొక్కిసలాట నేపథ్యంలో టీవీకే పార్టీ నిర్ణయం..వచ్చే వారం కరూర్ బాధితులను పరామర్శించనున్న విజయ్
పోలీసుల అనుమతితో కరూర్ వెళ్లనున్నరు..
కేసీఆర్ పాలన రైతులకు స్వర్ణయుగం : కేటీఆర్.
తెలంగాణలో 2014 నుంచి పదేళ్ల కాలంలో రైతుల బలవన్మరణాలు తగ్గాయన్న జాతీయ నేర గణాంక విభాగం నివేదికపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. తన అధికారిక సోషల్ మీడియా అకౌంట్ ఎక్స్ ద్వారా స్పందన తెలియజేశారు. కేసీఆర్ రైతుబంధు పాలన రైతులకు స్వర్ణయుగమనే విషయం మరోమారు రుజువైందని ఆయన పేర్కొన్నారు. అప్పటి ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలు, ప్రాజెక్టులవల్ల 2014 నుంచి 2023 మధ్య తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు గణనీయంగా తగ్గాయని కేంద్ర ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయని తెలిపారు..
2014లో తెలంగాణలో రైతులు, కౌలుదారులు, రైతు కూలీల ఆత్మహత్యల సంఖ్య 1,347గా ఉన్నదని, అదే 2023లో ఆ ఆత్మహత్యల సంఖ్య 56కు తగ్గిందని కేటీఆర్ చెప్పారు. అంటే 96 శాతం తగ్గుదల నమోదైందని అన్నారు. దేశంలోని రైతుల ఆత్మహత్యల్లో తెలంగాణ వాటా 2014లో 10.9 శాతం ఉంటే.. 2023 నాటికి అది 0.51 శాతం తగ్గిందని తెలిపారు. కానీ కాంగ్రెస్ అధికారంలోకి రాగానే పరిస్థితి తారుమారైందని విమర్శించారు. రెండేళ్లలోనే 700 మందికిపైగా అన్నదాతల ఆత్మహత్యలు నమోదయ్యాయని ఆందోళన వ్యక్తంచేశారు..