దసరా పండుగ వేళ తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ జగ్గారెడ్డి సంచలనం నిర్ణయం తీసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయనని క్లారిటీ ఇచ్చారు. సంగారెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి తన భార్య నిర్మల అంటూ ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. జగ్గారెడ్డి నిర్ణయం వెనుక కారణాలేంటి? ఎందుకు అలాంటి నిర్ణయం తీసుకున్నారంటూ ఆయన మద్దతుదారుల్లో ఒకటే చర్చ..
తెలంగాణ రాజకీయాల్లో మరో సంచలనం
దేశంలో రాజకీయాల ట్రెండ్ మారింది. పాత తరం నేతలను పార్టీలు పక్కన బెడుతున్నాయి. కొత్తవారికి అవకాశం ఇస్తున్నాయి. ఏ పార్టీ చూసినా అందరూ మహిళలకే ప్రాధాన్యత ఇస్తున్నాయి. రాబోయే పరిణామాలను ముందుగానే గమనించారు కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి. ఈ నేపథ్యంలో ఆయన సంచలన నిర్ణయం తీసుకున్నారు…
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేయలేదని తేల్చిచెప్పారు. దసరా రోజు గురువారం రాత్రి సంగారెడ్డిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు ఆయన. వచ్చే ఎన్నికల్లో సంగారెడ్డి నుంచి నా భార్య నిర్మల పోటీ చేస్తుందని తేల్చి చెప్పేశారు.
వచ్చే ఎన్నికలకు దూరమన్న జగ్గారెడ్డి
మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిపిస్తే నియోజకవర్గం కోసం ఏం చేయాలో అంతా చేశానంటూ ప్రజలకు వివరించారు. అయితే ఆయన శాశ్వతంగా రాజకీయాలకు దూరంగా కాలేదు. కేవలం పదేళ్ల వరకు ఎన్నికల్లో పోటీ చేయనన్నది ఆయన వెర్షన్