తాండూర్‌లో భారీ వర్షం, వాగులు పొంగిపొర్లుతున్నాయి
తాండూర్ లో ఈ రోజు మధ్యాహ్నం భారీ నుంచి అతి భారీ వర్షం కురిసింది. గాలి, మెరుపులతో కూడిన ఈ వర్షం సుమారు అరగంటకు పైగా కొనసాగింది. దీనితో వాగులు పొంగిపొర్లుతున్నాయి..
ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత ప్రజావాణి..!
జగిత్యాల కలెక్టరేట్ లో ప్రతీ సోమవారం జరిగే ప్రజావాణి కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ ఆదివారం రద్దు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో, ఎన్నికల కోడ్ ముగిసే వరకు ఈ కార్యక్రమం నిలిపివేయబడుతుంది. ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత ప్రజావాణి యధావిధిగా కొనసాగుతుందని కలెక్టర్ తెలిపారు….
ఏం చేస్కుంటారో చేసుకోండి
బరాబర్ ఫినిషింగ్ వేస్తా.. ఫెన్సింగ్ వేసుకుంటా
హైడ్రాకు ఛాలెంజ్ విసురుతూ కబ్జాకు గురైందని ఆరోపిస్తున్న 11 ఎకరాల భూమికి బాజప్తా ఫెన్సింగ్ వేసుకున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ
గాజుల రామారం సర్వే నంబర్ 307 లోని 11 ఎకరాల భూమికి ఫెన్సింగ్, బ్లూ షీట్స్ వేసుకుంటున్న అరికెపూడి గాంధీ
వీకెండ్ చూసుకొని పేదల ఇండ్ల మీదకు వెళ్లే హైడ్రా ఈ విషయంలో తమకేమీ పట్టనట్లు చూస్తుంది…
ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయనున్న దానం నాగేందర్?
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈరోజు సాయంత్రం రాజీనామా చేసే అవకాశం..
సుప్రీంకోర్టు ఆదేశానుసారం స్పీకర్ నిర్ణయం తీసుకోకముందే కొందరు ఎమ్మెల్యేలు తమ పదవికి రాజీనామా చేసి మళ్లీ పోటీ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా దానం నాగేందర్ రాజీనామా చేసి మళ్లీ పోటీ చేయాలని అనుకుంటున్నట్లు టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ అనడం మరింత బలం చేకూరుస్తోంది. అయితే రిజైన్ చేసి మళ్లీ ఎన్నికలకు వెళ్తే గెలుస్తారా? అనేది ఆసక్తిగా మారింది..
కన్నతల్లిని చంపి,, టీవీ చూస్తూ ఎంజాయ్ చేసిన కొడుకు..!
పేరెంట్స్ డబ్బులు ఇవ్వలేదని కక్ష పెట్టుకుని సొంత తల్లిని కిరాతకంగా చంపిన ఘటన వైఎస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరులో చోటుచేసుకుంది. కన్న తల్లిని దారుణంగా గొంతు కోసి ఇంటిబయట పడేశాడు. అనంతరం ఇంట్లో ఎలాంటి బాధ, భయం లేకుండా టీవీ చూస్తూ రాక్షసానందం పొందాడు. సైకోయిజం చూపించాడు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..ప్రొద్దుటూరులోని శ్రీరామ్‌నగర్‌లో ఉప్పలూరు లక్ష్మీదేవి, విజయ్ భాస్కర్ రెడ్డి దంపతులు ఇద్దరు నివసిస్తున్నారు. వీరికి కుమారుడు యశ్వంత్ కుమార్ రెడ్డి ఉన్నాడు. లక్ష్మీ దేవి గవర్నమెంట్ టీచర్ గా విధులు నిర్వహిస్తున్నారు. కుమారుడు యశ్వంత్ కుమార్ మూడేళ్ల క్రితం చెన్నైలో బీటెక్ పూర్తి చేశాడు. అనంతరం ఉద్యోగం కోసం హైదరాబాద్ కు వచ్చాడు. ఖర్చుల కోసం ప్రతి నెలా పేరెంట్స్ అతనికి డబ్బులు పంపిస్తారు. అయితే ఇటీవల ఓ రోజు తల్లికి కాల్ చేసిన యశ్వంత్ రూ.3వేలు అడిగాడు. వెంటనే పేరెంట్స్ అతనికి డబ్బులు పంపారు.
మళ్లీ యశ్వంత్ డబ్బులు పంపాలని పేరెంట్స్ కు కాల్ చేశాడు. ఈసారి రూ.10 వేలు పంపాలని తల్లిదండ్రులతో గొడవకు దిగాడు. డబ్బులు పంపకపోవడంతో యశ్వంత్ తల్లిపై కోపం పెంచుకున్నాడు. అనంతరం కుటుంబ సభ్యులకు ఎవరికీ చెప్పకుండా.. సండే మార్నింగ్ హైదరాబాద్ నుంచి పొద్దుటూరు లోని తన ఇంటికి వెళ్లాడు. ఇంట్లోకి వచ్చిన వెంటనే డబ్బులు ఎందుకు పంపలేదని గొడవకు దిగాడు..గొడవ చేసిన అనంతరం తల్లిపైకి ఏకంగా దాడికి దిగాడు. తల్లి గట్టిగా అరుపులు వేయడంతో ఆ కేకలు విన్న తండ్రి వెంటనే బయటకు వచ్చే ప్రయత్నం చేశాడు. అంతలోనే తండ్రికి లోపలికి నెట్టేసి డోర్ లాక్ చేశాడు. అనంతరం కూర గాయల కత్తితో తల్లి గొంతును దారుణంగా కోశాడు. రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతున్న లక్ష్మీ దేవిని ఈడ్చుకుంటూ వచ్చి బయట పడేశాడు. తీవ్రంగా రక్తస్రావం కావడంతో లక్ష్మీ దేవి ప్రాణాలు కోల్పోయింది. అనంతరం సైకో గాడు డోర్ వేసుకుని ఇంట్లో టీవీ పెట్టుకుని చూశాడు. చుట్టుపక్కల స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం లక్ష్మీదేవి మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.