*హైదరాబాద్ లో భారీ వర్షం*
ఎడతెరిపి లేకుండా గంటనుండి కురుస్తున్న భారీ వర్షం
నాంపల్లి, అబిడ్స్, అసెంబ్లీ,ఖైరతాబాద్ లో భారీ వర్షం
రోడ్డుపైకి భారీగా వరద నీరు
నాంపల్లి లో భారీగా ట్రాఫిక్ జామ్
తీవ్ర ఇబ్బందులు పడుతున్న వాహన దారులు…
బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కారణంగా తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.. అలాగే ఇప్పుడు హైదరాబాద్లో మళ్లీ వర్షం స్టార్ అయ్యింది. ఈ రోజు ఉదయం నుంచి వాతావరణం కాస్త ప్రశాంతంగా ఉండి ఒక్కసారిగా కుంభవృష్ఠి సృష్టించింది. హైదరాబాద్ లో పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుంది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సరిగ్గా భోజనం సమయంలో చాలా మంది బయటకు వెళ్లే సమయంలో వర్షం పడటం వల్ల ప్రజలు చాలా ఆందోళన చెందుతున్నారు…అయితే తెలుగు రాష్ట్రాల్లో మరో నాలుగు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. నేడు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, మహబూబ్నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల, మంచిర్యాల, ఖమ్మం, కామారెడ్డి ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెబుతున్నారు. అలాగే ఏపీలో శ్రీకాకుళం, పార్వతీపురం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి,చిత్తూరు, అన్నమయ్య, సత్యసాయి, వైఎస్ఆర్ కడప జిల్లాల్లో కూడా వర్షం కురుస్తుందని తెలిపారు. కావున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ అధికారులు సూచిస్తున్నారు…అయితే తెలుగు రాష్ట్రాల్లో మరో నాలుగు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. నేడు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, మహబూబ్నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల, మంచిర్యాల, ఖమ్మం, కామారెడ్డి ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెబుతున్నారు. అలాగే ఏపీలో శ్రీకాకుళం, పార్వతీపురం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి,చిత్తూరు, అన్నమయ్య, సత్యసాయి, వైఎస్ఆర్ కడప జిల్లాల్లో కూడా వర్షం కురుస్తుందని తెలిపారు. కావున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ అధికారులు సూచిస్తున్నారు.