అధికార కాంగ్రెస్ లో మంత్రుల పోరు…
మాటల తూటాలతో విమర్శల దాడి చేసుకుంటున్న మంత్రులు..!
చేటు చేస్తున్న మంత్రి పొన్నం నోటి దురుసు…
అహంభావం ప్రదర్శిస్తున్న మంత్రి వివేక్…
https://x.com/r9telugunews/status/1975613150365163773
తనకు మంత్రి పదవి రావడాన్ని పొన్నం వివేక్ జీర్ణించుకోలేక పోతున్నారని.. పొన్నం ఇష్టం వచ్చినట్లు దూషిస్తున్నాడని… వేదికపై నేను వస్తె వివేక్ లేచి వెళ్ళిపోతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేసిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్… అధిష్టానం పెద్దలకు పొన్నం పై ఫిర్యాదు చేస్తానని చెప్పిన అడ్లూరి..
ఇటీవల జూబ్లీహిల్స్ లో నిర్వహించిన సమావేశంలో అడ్లూరిని దున్నపోతు అంటూ వ్యాఖ్యలు చేసిన మంత్రి పొన్నం…
మరో మంత్రి వివేక్ తో సంభాషణలో పొన్నం ఈ కామెంట్ చేసినప్పటికీ.. వేదికపై ఉన్న మైక్ ఆన్ చేసి ఉండడంతో పొన్నం వ్యాఖ్యలు స్పష్టంగా బయటకి వినిపించాయి…
పొన్నం ఇప్పటికైనా తన వ్యాఖ్యలు వెనక్కితీసుకుని క్షమాపణ చెప్పకపోతే అధిష్టానం పెద్దలకు ఫిర్యాదు చేస్తానని చెప్పిన అడ్లూరి…..
మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్పై సహచర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ చేసిన వ్యాఖ్యలు.
మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్పై సహచర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. తాజాగా, అడ్లూరి లక్ష్మణ్ మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు…..నేను పక్కన ఉంటే వివేక్ అక్కడి నుంచి లేచి వెళ్లిపోతున్నారు. పొన్నం ప్రభాకర్లా నేను అహంకారంగా మాట్లాడటం రాదు. నా వద్ద డబ్బులు లేవు. పొన్నం తప్పు తెలుసుకుంటారనుకున్నాను. నేను కాంగ్రెస్ జెండాని నమ్ముకున్న వాడిని. మంత్రిగా మూడు నెలల పొగ్రెస్ చూసుకోండి..నేను మంత్రిని కావడం, మా సామాజిక వర్గంలో పుట్టడమే తప్పా. పొన్నం మారకపోతే జరిగే పరిణామాలకు ఆయనే బాధ్యత వహించాలి. నేను త్వరలో సోనియా, రాహుల్, ఖర్గే, మీనాక్షిని కలుస్తాను” అని తెలిపారు.
ఈ పరిణామాలతో, సీఎం రేవంత్ రెడ్డి చేసిన సూచనలతో మంత్రులు అడ్లూరి లక్ష్మణ్, పొన్నం ప్రభాకర్తో టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ఫోనులో మాట్లాడారు. ఇద్దరు మంత్రులు సమన్వయంతో కలిసి పని చేసుకోవాలని, ఒకరికొకరు సహకరించుకోవాలని అన్నారు. ప్రస్తుతం అడ్లూరి అదిలాబాద్ పర్యటనలో ఉన్నారు. హైదరాబాద్కు రాగానే కలుస్తానని చెప్పారు..