మోహన్ లాల్కు మరో అరుదైన గౌరవం..
భారత సైన్యాధిపతి జనరల్ ఉపేంద్ర ద్వివేది చేతుల మీదుగా ‘సీఓఏఎస్ కమెండేషన్’ అందుకున్న మోహన్ లాల్
టెరిటోరియల్ ఆర్మీలో లెఫ్టినెంట్ కర్నల్గా ఉన్న మోహన్ లాల్…..మలయాళ సినీ నటుడు మోహన్ లాల్(Mohanlal) గత నాలుగు దశాబ్దాలుగా సినిమా ఇండస్ట్రీకి ఎనలేని సేవలు చేస్తూ నటుడిగా మంచి గుర్తింపు పొందారు. ఇలా ఈయన మలయాళ చిత్ర పరిశ్రమలో మాత్రమే కాకుండా ఇండస్ట్రీలో పలు సినిమాలలో నటిస్తూ ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇలా నటుడిగా ఎన్నో విభిన్నమైన పాత్రలలో నటిస్తూ ఇండస్ట్రీకి ఈయన చేసిన సేవలను గుర్తిస్తూ ఇటీవల భారత ప్రభుత్వం మోహన్ లాల్ కు దాదాసాహెబ్ ఫాల్కే(Dadasaheb Phalke) అవార్డును అందజేసిన సంగతి తెలిసిందే. ఇటీవల భారత ప్రభుత్వం ప్రకటించిన 71వ జాతీయ చిత్ర ప్రధానోత్సవ కార్యక్రమాలలో భాగంగా ఈయన రాష్ట్రపతి చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని అందుకున్నారు.