బిసి రీజర్వేషన్ బిల్ విచారణ రేపటి కి వాయిదా వేసిన హైకోర్టు…!

బిసి రీజర్వేషన్ బిల్ విచారణ రేపటి కి వాయిదా వేసిన హైకోర్టు..

రేపు ప్రభుత్వం తరపున వాదనలు వినిపించనున్న రవి వర్మ కుమార్.

రేపు మధ్యాహ్నం 2:15 గంటలకు విచారణ వాయిదా వేసిన హైకోర్టు…

హైకోర్టులో బీసీ రిజర్వేషన్ల విచారణ రేపటికి వాయిదా పడింది. ఇవాళ ఇరు వర్గాల వాదనలు జరిగాయి. రేపు స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్‌పై పిటిషనర్ స్టే కోరారు. అయితే, స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది..ప్రభుత్వం తరఫున అభిషేక్ సింఘ్వీ వాదనలు వినిపించారు. “దాదాపుగా అన్ని రాజకీయ పార్టీలు బీసీ రిజర్వేషన్ల బిల్లును సమర్థించాయి. చట్టాన్ని ఎవరూ ఛాలెంజ్ చేయలేదు. కాకపోతే చట్టం ఆధారంగా జారీ చేసిన జీఓలను ఛాలెంజ్ చేశారు. జీఓకు మూలమైన చట్టాన్ని సవాల్ చేయకుండా జీవోను మాత్రమే ఛాలెంజ్ చేయడం కుదరదు.

రిజర్వేషన్ల గరిష్ఠ పరిమితి 50 శాతం దాటకూడదని సుప్రీంకోర్టు ఆదేశమే తప్పితే రాజ్యాంగంలో ఎక్కడా ఎలాంటి నిబంధన ఈ పరిమితి విధించలేదు. డేటా ఆధారంగా ప్రభుత్వానికి, శాసన వ్యవస్థకు తగిన నిర్ణయం తీసుకునే అధికారం ఉంది. 2018లో తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం పాసైన సమయంలో ఈ కసరత్తు జరగలేదు. 2019లో ఈడబ్ల్యూఎస్‌ 10% రిజర్వేషన్లు దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చాయి…