క్లిష్ట పరిస్థితుల్లో లొంగుబాటు నిర్ణయం ..ఆశన్న అలియాస్‌ రూపేష్‌ భావోద్వేగ సందేశం..!

క్లిష్ట పరిస్థితుల్లో లొంగుబాటు నిర్ణయం తీసుకున్నామని మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు ఆశన్న అలియాస్‌ రూపేష్‌ అన్నారు. లొంగిపోయే ముందు భావోద్వేగ సందేశం ఇచ్చారు. తమ సహచరుల్లో కొందరు ఇంకా పోరాడాలనుకుంటున్నారని చెప్పారు. మన భద్రతను పరిగణలోకి తీసుకోవాలని సహచరులను కోరుతున్నానని తెలిపారు. ముందుగా మనల్ని మనం రక్షించుకోవడం చాలా అవసరంమని, సమాజ ప్రధాన స్రవంతిలోకి రావాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. అడవులు, ఇతర రాష్ట్రాల్లోని మావోయిస్టులు లొంగుబాటులో తనతో పాటు చేరేవారు సంప్రదించాలని ఆశన్న పిలుపునిచ్చారు.

క్లిష్ట పరిస్థితుల్లో లొంగుబాటు నిర్ణయం తీసుకున్నాం. మా సహచరుల్లో కొందరు ఇంకా పోరాడాలనుకుంటున్నారు. మన భద్రతను పరిగణలోకి తీసుకోవాలని నా సహచరులను కోరుతున్నా. ముందుగా మనల్ని మనం రక్షించుకోవడం చాలా అవసరం. సమాజ ప్రధాన స్రవంతిలోకి రావాల్సిన సమయం ఆసన్నమైంది. అడవులు, ఇతర రాష్ట్రాల్లోని మావోయిస్టులు తనను సంప్రదించాలి. లొంగుబాటులో తనతో పాటు చేరేవారు సంప్రదించాలి…