మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ ఎపిసోడ్ అనేక ఆరోపణలు..!

మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ ఎపిసోడ్ రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని సిమెంటు కంపెనీల యాజమాన్యాలను సుమంత్ బెదిరించారని ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారాన్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. కాలుష్య నియంత్రణమండలి (పీసీబీ)లో ఓఎస్డీగా నియమితులై.. డిప్యుటేషన్ మీద అటవీ, దేవాదాయ మంత్రి కార్యాలయంలో ఓఎస్డీగా పనిచేసిన సుమంత్ ను తొలగిస్తూ మంగళవారం పీసీబీ కార్యదర్శి ఆదేశాలు జారీ చేశారు..అయితే, హైదరాబాద్ జూబ్లీహిల్స్ గాయత్రిహిల్స్‌లోని మంత్రి సురేఖ నివాసంలో సుమంత్ ఉన్నారని సమాచారంతో మఫ్టీలో ఉన్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. సుమంత్ పై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో అతడిని అదుపులోకి తీసుకునేందుకు వెళ్లారు. కొండా సురేఖ కుమార్తె సుస్మిత వారిని ఇంట్లోకి అనుమతించలేదు. దీంతో అర్ధరాత్రి వేళ హైడ్రామా చోటు చేసుకుంది. దీంతో ఎవరీ సుమంత్? ఏంటీ అసలు గొడవ?.. అనే విషయాలపై ప్రజలు ఆరా తీస్తున్నారు.

ఎవరీ సుమంత్..?
ఎన్. సుమంత్ పొల్యూషన్ బోర్డులో కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగిగా నియామకం అయ్యాడు. డిప్యూటేషన్ మీద మంత్రి కొండా సురేఖ ఓఎస్డీగా నియమితులయ్యారు. ఏడాదికోసారి సుమంత్ డిప్యూటేషన్ పొడిస్తూ వస్తున్నారు. ఈ ఏడాది డిసెంబర్ నెలలో సుమంత్ డిప్యూటేషన్ ముగుస్తుంది. మళ్లీ డిప్యూటేషన్ పొడిగింపు కోసం సురేఖ ప్రయత్నం చేస్తున్నారు. ఈలోపే సుమంత్ టెర్మినెట్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది…

అనేక ఆరోపణలు..

సుమంత్‌పైన అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఐఏఎస్ అధికారులకుసైతం నేరుగా ఆదేశాలు జారీ చేసే స్థాయికి సుమంత్ ఎదిగారని అధికార వర్గాల్లో చర్చ ఉంది. అటవీ శాఖల్లో బదిలీలు, ప్రమోషన్లకు లంచాలు తీసుకుంటారని ఆరోపణలు ఉన్నాయి. సెటిల్మెంట్లు, బెదిరింపులకు పాల్పడడం సమంత్ నైజంగా ప్రచారంలో ఉంది.

కొండా దంపతుల కెమార్తె సుస్మిత పటేల్‌కి సుమంత్ క్లాస్‌మేట్. దీంతో కొండా కుటుంబానికి సుమంత్ దగ్గరయ్యాడు. సమంత్ గృహప్రవేశానికి సుస్మిత పటేల్ లండన్ నుంచి ప్రత్యేకంగా వచ్చారు. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో రౌడీ షీటర్ గోపాల నవీన్‌రాజ్‌తో కలిసి సుమంత్ సిటిల్మెంట్లు చేస్తాడనే ప్రచారం ఉంది…
అటవీ శాఖలో బదిలీలు, ప్రమోషన్లకు లంచాలు తీసుకుంటారని, సెటిల్‌మెంట్లు, బెదిరింపులకు పాల్పడడం సుమంత్ నైజమని డిపార్ట్‌మెంట్‌లో టాకుంది. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో రౌడీషీటర్ గోపాల నవీన్ రాజ్‌తో కలిసి దందాలు చేస్తాడనే ప్రచారం కూడా ఉంది. ఐఏఎస్ అధికారులకు సైతం నేరుగా ఆదేశాలు జారీ చేసే స్థాయికి చేరిన సుమంత్‌కి ఇంకో బ్యాక్‌గ్రౌండుంది. కొండా దంపతుల కూతురు సుస్మితా పటేల్‌కి సుమంత్ క్లాస్ మేట్. ఆవిధంగా కొండా కుటుంబానికి దగ్గరయ్యాడు. సుమంత్ గృహప్రవేశానికి సుస్మిత పటేల్ లండన్ నుంచి ప్రత్యేకంగా వచ్చారంటే కొండా ఫ్యామిలీతో సుమంత్‌కి ఎంతటి సాన్నిహిత్యమూ తెలుసుకోవచ్చు.

సుమంత్ కుటుంబం మీద కూడా వివిధ రకాల ఆరోపణలు ఉన్నాయి. సుమంత్ తండ్రి సుబ్రమణ్యం విద్యుత్ శాఖలో అధికారి. అవినీతి ఆరోపణల కేసులో పలుసార్లు ఉద్యోగం నుండి తొలగించబడ్డారు. సుమంత్ సోదరుడు ఆస్ట్రేలియాలో భార్యను హత్యచేసిన కేసులో కూడా సుబ్రమణ్యం అరెస్ట్ అయ్యారు. హైదరాబాద్ కొంపల్లిలో సుమంత్ కు అధునాతన గృహం, విలాసవంతమైన జీవితం, ఆడి కారు ఉంది.
సుమంత్ తండ్రి సుబ్రమణ్యం విద్యుత్ శాఖలో అధికారిగా ఉంటూ, అవినీతి ఆరోపణలతో ఊస్టింగ్ అయ్యారు. సుమంత్ సోదరుడు మహంత్‌పై కూడా హంతకుడనే అభియోగాలున్నాయి. ఆస్ట్రేలియాలో ఉంటున్న మహంత్ భార్య రమ్యకృష్ణ ఇటీవలే అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. మహంతే హత్య చేసి, ఆత్మహత్యగా చిత్రీకరించారని ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. సుమంత్ భార్య మనీషా కూడా బాధితురాలే. అతడి వివాహేతర సంబంధాలతో విసిగిపోయి హైటెక్ సిటీలోని తన ఇంట్లో ఆత్మహత్యకు యత్నించింది. సుమంత్ తండ్రి సుబ్రమణ్యం, కొండా మురళి ఈ విషయం బైటికి రాకుండా ఆమె పేరెంట్స్‌తో మాట్లాడి సర్దేశారు. సో, ఇదొక ఫ్యామిలీ ప్యాక్ క్రైమ్ కహానీ.

ఇన్ని మచ్చలున్నా, బడాయిలో మాత్రం తగ్గేదే లేదంటున్నాడు నార్ల సుమంత్. కొంపల్లిలో అల్ట్రా మోడర్న్ హౌస్, ఆడి కారు.. విలాసాలే విలాసాలు. హన్మకొండ జిల్లా కదిపికొండలో మూడు విల్లాలు.. ఒక్కోటి ఐదు కోట్ల రూపాయల ఖరీదు. ఇవి కాకుండా, లండన్‌లో సుస్మిత ఉండే ఏరియాలో సుమంత్ ఇటీవలే ఓ ఇల్లు కొన్నాడట. అతడి సోదరుడు మహంత్ కూడా ఆస్ట్రేలియా నుంచి లండన్ షిప్ట్ అయ్యారట. సుమంత్ తల్లి సుగుణాదేవి వరంగల్ భద్రకాళీ ఆలయం బోర్డులో సభ్యురాలు. సుమంత్ ఓఎస్డీగా ఉన్నప్పుడు మంత్రి సురేఖతో చెప్పించుకుని మరీ తన తల్లిని ధర్మకర్తగా నియమించుకున్నాడు. సో, కొండా ఫ్యామిలీతో నార్ల సుమంత్ కనెక్షన్ చాలాచాలా బలమైనది. అందుకే, సుమంత్ కోసం కొండా సురేఖ ఎందాకైనా వెళ్తున్నారా?.. ఎపిసోడ్కి ఎక్కడ పులిస్టాప్ దొరుకుతుంది కొంత వెయిట్ చేయాల్సిందే..