🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏
🌹పంచాంగం🌹
శ్రీరస్తు – శుభమస్తు – అవిఘ్నమస్తు,
తేదీ … 17 – 10 – 2025,
వారం … భృగువాసరే ( శుక్రవారం )
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం,
దక్షిణాయనం,
శరదృతువు,
ఆశ్వయుజ మాసం,
బహుళ పక్షం,
తిథి : *ఏకాదశి* మ1.08 వరకు,
నక్షత్రం : *మఖ* సా4.42 వరకు
యోగం : *శుభం* ఉ6.12 వరకు
తదుపరి *శుక్లం* తె4.55 వరకు,
కరణం : *బాలువ* మ1.08 వరకు,
తదుపరి *కౌలువ* రా1.07 వరకు,
వర్జ్యం : *ఉ.శే.వ.6.13 వరకు*
మరల *రా12.56 – 2.34*
దుర్ముహూర్తము : *ఉ8.15 – 9.02*
మరల *మ12.08 – 12.55*
అమృతకాలం : *మ2.17 – 3.54*
రాహుకాలం : *ఉ10.30 – 12.00*
యమగండం : *మ3.00 – 4.30*
సూర్యరాశి : *కన్య*
చంద్రరాశి : *సింహం*
సూర్యోదయం : *5.56*
సూర్యాస్తమయం : *5.35*
*_నేటి విశేషం_*
*_𝕝𝕝ॐ𝕝𝕝 శృఙ్గేరీ జగద్గురు శ్రీ చంద్రశేఖర భారతీ మహాస్వామినాం జయంతి 𝕝𝕝卐𝕝𝕝_*
*≈≈≈❀┉┅━❀ 🕉️ ❀┉┅━❀≈≈≈*
*_శృఙ్గేరీ జగద్గురు శ్రీ చంద్రశేఖర భారతీ (1912-1954)_*
*≈≈━❀ ꧁ 🔆 ꧂ ❀━≈≈*
సదాత్మధ్యాన నిరతం విషయేభ్యః పరాఙ్ముఖం
నౌమి శాస్త్రేషు నిష్ణాతం చంద్రశేఖర భారతీమ్ ||
జగద్గురువులు ఆది శంకరాచార్యులు స్థాపించిన మొట్టమొదటి దక్షిణామ్నాయ శ్రీ శృంగేరి శారదా పీఠ 34వ ఆచార్యులుగా, పీఠాధీశులుగా జగద్గురు శ్రీ శ్రీ చంద్రశేఖర భారతీ మహాస్వామిజీ వారు విశిష్టమైన ఉన్నత ప్రజ్ఞానిథికి పండితులు, సాధువు మరియు తపః చక్రవర్తి.
వారి చిన్నతనం నుండి, ధర్మం, సన్మార్గము మరియు మంచి నడవడిక పట్ల వారికున్న ఉత్సాహం మరియు గురువు, దైవం పట్ల వారికున్న భక్తి అనంతం.
द्युवनान्त इवामरद्रुमा अमरद्रुष्विव पुष्पसञुयाः ।
भ्रमरा इव पुष्प सञुयेषु अतिसंख्याः किल शङ्करे गुणः ॥
కల్పవృక్ష వాటికలో చెట్లు లెక్కలేనన్ని ఉన్నాయి మరియు సమానంగా ఆ చెట్లపై పువ్వులు మరియు ఆ పువ్వులపై తేనెటీగలు ఉన్నాయి. అదేవిధంగా, శంకరుల యొక్క మంచి లక్షణాలు కూడా లెక్కలేనన్ని ఉన్నాయి. తమ బాల్యం నుంచి, శ్రీ చంద్రశేఖర భారతీ మహాస్వామి వారు తమ గురువులైన శ్రీ సచ్చిదానంద శివాభినవ నరసింహ భారతీ మహాస్వామి ప్రభావంతో, వారి అడుగు జాడలలో పైకి వచ్చారు, వారు తమ శిష్యుని విద్యపై ప్రత్యేక ఆసక్తి, శ్రద్ధను కనబరిచినారు. శ్రీ శ్రీ చంద్రశేఖర భారతీ మహాస్వామి వారు శృంగేరి మరియు బెంగళూరులోని పాఠశాల యందు చదువుకున్నారు మరియు శాస్త్రాలలో అసాధారణమైన నైపుణ్యాన్ని సంపాదించినారు.
20 సంవత్సరాల అతి చిన్న వయస్సులోనే వారు శృంగేరి శారదా పీఠాధిపత్యం వహించి, దాని వ్యవహారాలను చాలా సమర్థవంతముగా నిర్వహించినారు. ప్రతిష్టాత్మకమైన శృంగేరి సంస్థానం వద్ద తమ మహోన్నతమైన స్థానాన్ని ఉత్తేజ పరచుకుంటూ, ప్రాపంచిక కోరికలు లేకుండా నిరాడంబరమైన జీవితాన్ని గడుపుతూ వచ్చిన గొప్ప సాధువు, మహా యోగి వారు.
ధార్మిక విషయములలో కొంచమైననూ నమ్మకం లేని నాస్తికులను సహితం ఆస్తికులుగా మార్చగల అత్భుతమైన తపః శక్తి వారికున్నది. తమ వద్దకు తీసుకువచ్చిన ఏ అంశాన్ని అయినా అతి తేలికగా, నమ్రతతో తమ శిష్యులకు వివరించగలిగేవారు. వారు వేద శాస్త్రములయందు అద్వితీయ పండితులు అయినప్పటికీ, కనీస అహంకారం లేని నిగర్వి. తదుపరి సంవత్సరాలలో వారు మఠం యొక్క వ్యవహారాలపై పెద్దగా ఆసక్తి చూపలేదు, కానీ ఏ చిన్న పొరపాటు సంభవించినా కూడా దానిని గుర్తించి సరిదిద్దగల మేధాశక్తి సామర్థ్యములు వారికి గలవు.
శ్రీ చంద్రశేఖర భారతీ మహాస్వామి వారు పరమ విరాగులై, ఎక్కువ సమయం అంతర్ముఖులై తపస్సులో గడపాలనుకొనేవారు. 40 సంవత్సరాల వయస్సులో, వారు తమ వారసుడిని నియమించినారు. ధర్మ మార్గంలో ప్రజలకు దిశా నిర్దేశం చేయడానికి వారు ఈ లోకంలో అవతరించిన ఓ మహా యోగి అని చెప్పాలి.
వారు భగవంతుడ్ని ఆరాధించే పద్ధతి అందరికీ అనుసరణీయమైనది. వారు శ్రీ నృసింహ స్వామి జయంతి రోజున మధ్యాహ్నం నుండి సాయంత్రం వరకు గంటలు కొద్దీ పూజలు చాలా అంకితభావంతో చేస్తూ వుంటారు. వాస్తవానికి ఇది నారసింహ అవతారం జరిగిన సమయం.
సంతు నమాంసి సహస్రం శ్రీమద్భ్యశ్చంద్రశేఖర గురుభ్యః
యేషాం హృదయే వదనే నామని పూతే చ భారతీ లసతి||
మహా యోగి, తపోనిధులు అయిన శ్రీ చంద్రశేఖర భారతీ మహాస్వామి వారికి సహస్ర సాష్టాంగ నమస్కారములు. పేరులోనే కాకుండా, వారి హృదయంలో మరియు వాక్కులో కూడా వారు భారతీ (శారద) అన్న పేరును కలిగి ఉన్నారు.
పరమ పూజ్యులు, భక్తి, జ్ఞాన, యోగాది మార్గములలో పయనించి ఆత్మ సాక్షాత్కారమును పొందిన మహా జ్ఞాని, మహా గురువులు, మహా తపస్వి అయిన శ్రీ శ్రీ చంద్రశేఖర భారతీ మహాస్వామి వారు 1912-1954 నుండి సర్వోత్కృష్టమైన అతీంద్రియ జ్ఞాన సింహాసనం, వ్యాఖ్యాత సింహాసనాన్ని అలంకరించినారు.
*_𝕝𝕝ॐ𝕝𝕝 శ్రీ జగద్గురు శఙ్కరాచార్య దివ్యాజ్ఞాం వర్ధతాం అభివర్ధతాం 𝕝𝕝卐𝕝𝕝_*
*_𝕝𝕝ॐ𝕝𝕝 జయ జయ శఙ్కర హర హర శఙ్కర 𝕝𝕝卐𝕝𝕝_*
*_𝕝ॐ𝕝𝕝 శ్రీమతే శఙ్కరాచార్య నమః 𝕝𝕝卐𝕝𝕝_*
*_🌹శుభమస్తు🌹_*
🙏 సమస్త లోకా సుఖినోభవంతు 🙏